కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరిస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కోసం రూ.51.14 కోట్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో కిట్ ధర రూ.1,410గా నిర్ణయించగా, ఈ కిట్‌లో 11 రకాల వస్తువులు ఉంటాయి.
కిట్‌లోని వస్తువులు:
దోమ తెర
బేబీ బెడ్
డ్రస్
టవల్స్
వాషబుల్ న్యాప్‌కిన్లు
200 గ్రాముల జాన్సన్ పౌడర్
100 గ్రాముల జాన్సన్ షాంపు
ఇతర అవసరమైన వస్తువులు
ఈ పథకం ద్వారా నవజాత శిశువుల సంరక్షణకు అవసరమైన సామగ్రిని అందించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa