అనంతపురం పీటీసీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, గతంలో పీటీసీ స్టేడియంలో వాకర్స్‌కు ప్రవేశం విషయంలో అనేక పరిమితులు ఉండేవని తెలిపారు. ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన సమయంలో ఆయన తక్షణమే స్పందించి, సంబంధిత అధికారులతో చర్చించి, వాకర్స్‌కు వ్యాయామం కోసం స్టేడియంలో ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు.
వాకర్స్ అసోసియేషన్ ఈ అవకాశాన్ని అమూల్యంగా భావించి, ఎమ్మెల్యే వ్యక్తిగతంగా తీసుకున్న ఈ నిర్ణయానికి కృతజ్ఞతగా ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, స్థానిక నాయకులు మరియు వ్యాయామ ప్రేమికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa