త్తరప్రదేశ్‌లోని మథురలో జరిగిన దారుణ ఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు యువకులు ఒక బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిందితులు ఆమెపై అత్యాచారం చేసిన దృశ్యాలను వీడియోలుగా తీసి, ఆ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ గత నాలుగు నెలలుగా ఆమెపై అత్యాచారం కొనసాగించారు.
బాధిత బాలిక నిరసన వ్యక్తం చేయడంతో, నిందితులు ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa