ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్... మేళతాళాలు, బైక్లు, కార్లతో భారీ ఊరేగింపు

Crime |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 09:09 PM

బెయిల్‌పై విడుదలైన సామూహిక అత్యాచారం కేసులో నిందుతలకు టపాసులు పేల్చి.. మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. దేశం కోసం జైలుకెళ్లినట్టు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆశ్చర్యానికి గురిచేసే ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పదహారు నెలల కిందట కర్ణాటకలోని హావేరి జిల్లాలోని ఒక హోటల్ గదిలో జంటపై పలువురు వ్యక్తులు దాడి చేసి, ఆ మహిళను అటవీ ప్రాంతానికి లాగి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా, ఈ కేసులో ప్రధాన నిందితులు ఏడుగురికి బెయిల్ మంజూరైంది. దీంతో వారి స్నేహితులు, అనుచరగణం కార్లు, బైక్‌లతో భారీ ఊరేగింపు చేపట్టారు. ఈ ఊరేగింపునకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితులు చిరునవ్వులు చిందిస్తూ, విజయం చిహ్నాలు చూపుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారి తీసింది.


ఏడుగురు ప్రధాన నిందితులు: అఫ్తాబ్ చందనక్కట్టి, మదర్ సాబ్ మందక్కి, సమీవుల్లా లలానావార్, మహమ్మద్ సదిక్ అగసిమనీ, షోయబ్ ముల్లా, తౌసీప్ చొటి, రియాజ్ సవికేరిలకు హావేరి సెషన్స్ కోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. సామూహిక అత్యాచారం కేసులో అరెస్టైన వీరింతా అనేక నెలలుగా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.


మైనారిటీ కమ్యూనిటీకి చెందిన బాధిత మహిళ.. ళ్ల కర్ణాటక రాష్ట్ర రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KSRTC) డ్రైవర్‌తో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఈ క్రమంలో 2024 జనవరి 8న హనగల్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో ఈ జంట దిగింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఓ గుంపు... ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.


భాదితురాలి మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూల్మం ఇచ్చిన తర్వాత మాత్రమే గ్యాంగ్ రేప్ కేసుగా మార్చారు. మొదట పోలీసులు దీన్ని మోరల్ పోలీసింగ్ కేసుగా నమోదు చేశారు, ఎందుకంటే వేర్వేరు మతాలకు చెందిన బాధితురాలు, ఆమె భాగస్వామి ఆ హోటల్ గదిలో ఉన్నారు. జనవరి 11న ఆమె మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా గ్యాంగ్ రేప్ సెక్షన్లను జోడించారు.


మొత్తంగా ఈ కేసులో 19 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఏడుగురు ప్రధాన నిందితులు కాగా, మిగతా 12 మంది వారికి సహకరించడం లేదా బాధితురాలిని శారీరకంగా హింసించినట్టు భావిస్తున్నారు. ఆ 12 మందికి దాదాపు పది నెలల కిందటే బెయిల్ మంజూరైంది. ప్రధాన నిందితులకు మాత్రం ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణల సమయంలో బాధితురాలు నిందితులను గుర్తించేటప్పుడు తడబడటంతో కేసు బలహీనపడినట్లు సమాచారం. ఈ ఊరేగింపుపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అత్యాచార కేసులో నిందితులకు భారీ ర్యాలీతో స్వాగతం న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని పలువురు విమర్శకులు అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa