ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం శివపురం వద్ద చంద్రబాబు కొత్త ఇల్లు నిర్మించిన సంగతి తెలిసిందే. ఆదివారం నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త ఇంటిలోకి చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు శాస్త్రోక్తంగా అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 36 ఏళ్లుగా తమ కుటుంబానికి అండగా నిలుస్తూ.. ప్రతి అడుగులో తోడుగా ఉన్న కుప్పం ప్రజల సమక్షంలో కొత్తింట్లోకి అడుగుపెట్టడం మరిచిపోలేని అనుభూతిగా అభివర్ణించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa