పీరియడ్స్ టైమ్‌లో చాలా ఇబ్బందిగా, చిరాగ్గా ఉంటుంది. అదే టైమ్‌లో కొన్ని ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. దీనికి కారణం ఆ టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ శైలా ఉస్మాన్ అలీ(Fertility Expert, Birla Fertility & IVF, Chennai) చెబుతున్నారు. కాలం ఎంతగా మారినా చాలా చోట్ల పీరియడ్స్ గురించి మాట్లాడడమే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. దీంతో ఆ టైమ్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చాలా మంది పట్టించుకోరు. అయితే, కొన్ని ఫాలో అయితే ఇన్ఫెక్షన్స్‌ని దూరం చేసుకోవచ్చు. దానికోసం మనం ఏం చేయాలంటే
ప్యాడ్స్, టాంపూన్స్, కప్స్‌ని మార్చడం
పీరియడ్స్ టైమ్‌లో ఒక్కొక్కరు వారి వీలుని బట్టి ప్యాడ్స్, టాంపాన్స్, మెనుస్ట్రువల్ కప్స్‌ని వాడతారు. ఇది రోజంతా అలానే ఉంచకుండా రెగ్యులర్‌గా మారుస్తుండండి. మీరు వాడే దాన్ని బట్టి ఎన్ని గంటలకి ఓ సారి మార్చోలో తెలుసుకోండి.
ప్యాడ్స్, టాంపాన్స్ : ప్రతి 4 గంటల నుండి 6 గంటలకోసారిమెనుస్ట్రువల్ కప్స్ : ప్రతి 6 నుండి 12 గంటలకోసారి(బ్లీడింగ్‌ని బట్టి)
ఒకే ప్రోడక్ట్‌ని ఎక్కువసేపు మార్చకుండా వాడడం వల్ల స్కిన్ ఇరిటేషన్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
ప్రైవేట్ పార్ట్స్‌ని క్లీన్ చేయడం
శుభ్రమైన నీటితో యోని ప్రాంతాన్ని ముందు నుండి వెనక్కి సున్నితంగా కడగాలి. అవసరమైతే ఎలాంటి సువాసనలు లేని మైల్డ్ సబ్బుతో క్లీన్ చేసయండి. సువాసన ఉండే వైప్స్, స్ప్రే, హార్ష్ సబ్బులను వాడొద్దు. ఇవి సహజ pH బ్యాలెన్స్‌ని దెబ్బతీస్తాయి. దురద, ఇన్ఫెక్షన్స్‌కి దారితీస్తాయి.
శుభ్రమైన, కంఫర్ట్ ఇన్నర్ వేర్స్
మీ స్కిన్‌కి గాలి తగిలేలా శుభ్రమైన కాటన్ ఇన్నర్ వేర్స్ వేసుకోండి. పీరియడ్స్ టైమ్‌లో టైట్, సింథటిక్ బట్టలు వాడొద్దు. వీటి వల్ల తేమ, వేడిని బంధిస్తాయి. దీంతో ఇరిటేషన్, ఇన్ఫెక్షన్స్ వస్తాయి.
వాడిన తర్వాత
ప్యాడ్స్, టాంపూన్స్, లైనర్స్‌ని ఎప్పుడు టాయిలెట్ ఫ్లష్‌లో వేయొద్దు.
వీటి బదులు టాయిలెట్ పేపర్, డిస్పోజల్ బ్యాగ్‌లో చుట్టడి వాటికోసమే ఉంచి డస్ట్‌బిన్‌లో వేయండి.
మెనుస్ట్రువల్ కప్‌ని వాడితే దానిని ఖాళీ చేసి క్లీన్ చేసుకోండి. దీనిని నీటిలో వేసి మరిగించండి.
సరైన విధంగా క్లీన్ చేయండి. వ్యర్థాలను పారేయండి. అప్పుడే పర్యావరణానికి మంచిది.
మీరు, చేతుల్ని క్లీన్ చేసుకోండి
ప్రతిరోజూ స్నానం చేయండి. పీరయిడ్స్ టైమ్‌లో మీరు ఫ్రెష్ అండ్ క్లీన్‌గా ఉంచడానికి సాయపడుతుంది.
ప్యాడ్, టాంపూన్స్, కప్పు మార్చడానికి ముందు, తర్వాత చేతుల్ని క్లీన్ చేసుకోవడం మర్చిపోవద్దు.
బయటికి వెళ్లినప్పుడు పీరియడ్ కిట్స్ అంటే ప్రోడక్ట్స్, టిష్యూస్, హ్యాండ్ శానిటైజర్స్, శుభ్రమైన ఇన్నర్ వేర్స్ తీసుకెళ్లండి.
ఇన్ఫెక్షన్స్ లక్షణాలు పీరియడ్స్ టైమ్‌లో కొన్ని విషయాలు ఇబ్బందిగా ఉంటాయి. అది మరింత సమస్యగా ఉన్నప్పుడు డాక్టర్‌ని కలవండి. అవి
యోని నుంచి వాసన
దురద, మంట, ఎరుపు
మందపాటి, వింత రంగు స్రావాలు
జ్వరం, పొత్తికడుపు నొప్పి, ఇబ్బందిగా ఉండడం మంచిది కాదు. ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.
డైట్, నీరు
పుష్కంలగా నీరు తాగండి. పండ్లు, కూరగాయలు, హోల్ గ్రెయిన్స్, ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోండి. దీని వల్ల ఉబ్బరం, తిమ్మిరి వంటి సమస్యలు తగ్గుతాయి. మీ శక్తి స్థాయిలను పెంచడంలో సాయపడుతుంది.
పీరియడ్స్ అనేవి లైఫ్‌లో భాగం. ఈ టైమ్‌లో మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడాలి. పరిశుభ్రంగా ఉండాలి. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్. కాబట్టి, అవగాహన అనేది చాలా ముఖ్యం. మీ బాడీని అర్థం చేసుకుని సరైనవి ఎంచుకోవాలి. అదే విధంగా, పీరియడ్స్ గురించి మాట్లాడడం నేరమేమీ కాదు. మీకు తెలిసినది వేరేవారితో పంచుకోవడం, తెలియని విషయాల్ని అడిగి తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa