కడపలోని మహానాడు కార్యక్రమంలో సీఎం చంద్రబాబుకు 'యువగళం' పాదయాత్ర పుస్తకాన్ని మంత్రి నారా లోకేశ్ అందించారు. చంద్రబాబు ఆ పుస్తకంలోని అంశాలను పరిశీలించి లోకేశ్‌ను అభినందించారు. దీంతో లోకేశ్ తన తండ్రి పాదాలకు నమస్కరించారు. అనంతరం తన పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని నాన్నగారికి ఇవ్వడం సంతోషంగా ఉందని Xలో ట్వీట్ చేశారు. తన ఈ ప్రయాణంలో సహకరించిన టీడీపీ నాయకులు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa