హర్యానాలోని మెహమ్ లో రెండు నెలల బాలుడు హత్యకు గురయ్యాడు. అజైబ్ గ్రామంలో ప్రియాంక అనే మహిళ తన రెండు నెలల కొడుకుతో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఓ మహిళ ఆ ఇంట్లోకి ప్రవేశించింది. ఈ క్రమంలో ప్రియాంకకు ఆమె ఏదో తినిపించి అపస్మారక స్థితికి తీసుకెళ్లేలా చేసింది. అనంతరం చిన్నారిని డ్రమ్ములో ముంచి చంపేసింది. ప్రియాంకను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాంత్రిక విద్య కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa