హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ( HAL) ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోనుందనే వార్తలను కర్ణాటక ప్రభుత్వం ఖండించింది. ఇటీవల ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్‌ను కలిసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. HAL కార్యకలాపాలను తమ రాష్ట్రంలో విస్తరించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కొత్త గ్రీన్‌ఫీల్డ్ HAL కేంద్రాన్ని స్థాపించాలన్న ప్రతిపాదనను రాజ్‌నాథ్ ముందు ఉంచారు. ఇందులో భాగంగా తేజస్ యుద్ధ విమానాలు సహా స్వదేశీ రక్షణకు సంబంధించి భవిష్యత్ ఉత్పత్తుల సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలనేది లక్ష్యం. దీంతో HAL ఉత్పత్తి యూనిట్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయన్నే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ ప్రచారాన్ని కర్ణాటక ప్రభుత్వం తోసిపుచ్చింది.
అటు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ విషయంపై స్పష్టతనిచ్చింది. హెచ్ఏఎల్ ప్రధాన యూనిట్‌ను తరలించాలని కోరలేదని, కొత్త విభాగం ఏర్పాటుకు మాత్రమే ప్రతిపాదన చేశామని తెలిపింది. ఇందుకోసం ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేపాక్షిలో 10,000 ఎకరాల భూమిని అందించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
కాగా, ప్రస్తుతం కర్ణాటకలో బెంగళూరు, తుమకూరులో హాల్‌కు ప్రధాన ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి.. స్వదేశీ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, శిక్షణా విమానాలు ఇందులో తయారవుతున్నాయి. అటు, చంద్రబాబు వ్యాఖ్యలపై కర్ణాటక ప్రభుత్వ నేతలు తీవ్రంగా స్పందించారు. కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఎంబీ పాటిల్ మాట్లాడుతూ.. ‘హెచ్ఏఏల్ ఉనికి ఉన్న యూనిట్లను ఎలాంటి ముఖ్యమంత్రి తరలించలేరు. బెంగళూరులోని కార్యకలాపాలు యధాతధంగా కొనసాగతాయి. కొత్త యూనిట్ ఏర్పాటు వేరే విషయం’ అన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కూడా అదే అభిప్రాయాన్ని పునరుద్ఘాటించారు: ‘నాకు తెలిసినంతవరకూ ఇది సాధ్యపడదు. HAL తరలింపు జరగదు’ అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘HALను బీజేపీ (మోదీ ప్రభుత్వం) ఏర్పాటుచేయలేదు.. పండిట్ నెహ్రూ బెంగళూరులో ఏర్పాటు చేశారు. మేము తుమకూరులో హెలికాప్టర్ యూనిట్ కోసం కూడా భూమి కేటాయించాం. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏదైనా ఏర్పాటు చేయాలంటే వారికి స్వేచ్ఛ ఉంది. కానీ కర్ణాటక HAL యూనిట్లను కాపాడుకోడానికి మేము దేనికైనా సిద్ధం’ అని అన్నారు.
అలాగే ఆయన కర్ణాటక బీజేపీ ఎంపీల మౌనాన్ని ప్రశ్నించారు: ‘ఢిల్లీలోని మన ప్రతినిధులు ఏమి చేస్తున్నారు? కేంద్ర మంత్రులెవరూ ఈ విషయంపై మాట్టాడలేదు. వాళ్లు రాష్ట్రాన్ని మోసం చేస్తున్నట్టే’ అని విమర్శించారు. కాగా, చంద్రబాబు కలిసిన రోజునే అత్యాధునిక మధ్యతరహా యుద్ధ విమానం (AMCA) ప్రాజెక్ట్‌కు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలపడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఎరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ADA) ఆధ్వర్యంలో HAL సహకారంతో నడుస్తోంది.
కర్ణాటక వైద్య విద్యా, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ పటేల్ మాట్లాడుతూ.. "HAL మా రాష్ట్రానికి గర్వకారణం. దీనిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించనివ్వం. కాంగ్రెస్ ప్రభుత్వమే దీనిని తీసుకొచ్చింది. బీజేపీ ఎంపీలు స్పందించకపోతే, వారు రాష్ట్రాన్ని ద్రోహం చేసినట్లే’ అని విమర్శించారు.
HAL ఇప్పటికే తెజస్ యుద్ద విమానాల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇటీవల రూ. 6,500 కోట్ల విలువైన 83 LCA Mk1A విమానాల ఆర్డర్‌కు ఆమోదించింది. భవిష్యత్‌లో Mk2, AMCA వంటి ప్రాజెక్టులకు మరిన్ని వనరులు, మానవవనరులు అవసరం కానున్నాయి అయితే, HAL విస్తరణకు సంబంధించి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa