వాయవ్య బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన వాయుగుండం గురించి IMD కీలక సమాచారం ఇచ్చింది. పారాదీప్ తూర్పు ఈశాన్యానికి 190 కి.మీ. దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావం వలన రాబోయే 24 గంటల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంట 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa