రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్న నేపథ్యంలో పోటీ తీవ్రస్థాయిలో నెలకొంది. 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా 3,35,401 మంది 5,77,675 దరఖాస్తులు సమర్పించారు. సగటున ఒక్కో పోస్టుకు 35.33 మంది పోటీపడుతున్నారు. వారికి ఈ నెల 6 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులకు హాల్‌టికెట్లు శనివారం విడుదలయ్యాయి. కంప్యూటర్ ఆధారంగా జరగనున్న ఈ పరీక్షల కోసం రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల్లో 150 సెంటర్లు ఏర్పాటుచేశారు. ఏపీతో పాటు హైదరాబాద్, చెన్నై, బరంపురం, బెంగళూరుల్లో పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. ప్రతిరోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల కోసం 5 జిల్లాలను ఆప్షన్లుగా ఎంపిక చేసుకోగా 87.8 శాతం మందికి మొదటి ఆప్షన్ జిల్లాలోనే పరీక్షా కేంద్రం కేటాయించారు. ఆగస్టు రెండో వారంలో డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి. విజయరామరాజు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa