నరసన్నపేట మండలంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుండి కోల్ కత్తాకు వెళ్తున్న లారీ గుండువిల్లిపేట దగ్గర ముందుకు పోతున్న ఐచర్ వాహనాన్ని ఢీకొట్టింది. లారీ ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందాడు. హైవే పెట్రోలింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయం అందించారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa