భారత్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన బెంగళూరులోని వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA)ను ఉల్లంఘించినందుకు కబ్బన్ పార్క్ పోలీసులు సుమోటోగా ఈ చర్యలు చేపట్టారు. స్మోకింగ్ ఏరియా లేకుండా రెస్టారెంట్‌లో స్మోకింగ్ జరిగిందని అధికారులు తెలిపారు.ఈ ఉల్లంఘన నేపథ్యంలో, సదరు పబ్ మేనేజర్‌తో పాటు ఇతర సిబ్బందిపై సీఓటీపీఏ చట్టంలోని సెక్షన్-4, సెక్షన్-21 కింద కేసు నమోదు చేసినట్లు కబ్బన్ పార్క్ పోలీస్ ఎస్సై అశ్విని మీడియాకు వెల్లడించారు. చట్ట ప్రకారం అవసరమైన ఏర్పాట్లు చేయనందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనతో విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ వార్తల్లో నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa