గుంటూరు నగరంలో బక్రీద్ పండుగ సహృద్భావ వాతావరణంలో జరుపుకోవాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర కమిషనర్ పులి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం నగర పాలక సంస్థలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఈ నెల 7న జరగబోయే బక్రీద్ పండుగ నిర్వహణ పై ముస్లిం, హిందూ మత పెద్దలతో ప్రత్యేక సమావేశం జరిగింది. హిందూ ముస్లింల ఐక్యతను గుంటూరు నగరం ఆదర్శంగా నిలవాలని వారు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa