అగళి మండలంలో హెడ్‌మాస్టర్ల (ఎచ్ఎంలు) బదిలీల నేపథ్యంలో నలుగురు హెడ్‌మాస్టర్లు బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లారు. వారి స్థానాల్లో కొత్తగా నియమితులైన నలుగురు హెడ్‌మాస్టర్లు సోమవారం విధుల్లో చేరారు. ఈ విషయాన్ని మండల విద్యాధికారి (ఎంఈఓ) చంద్ర శేఖర్ నాయుడు తెలిపారు.
బదిలీపై వెళ్లిన హెడ్‌మాస్టర్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
రవీంద్ర మూర్తి
వరద రాజులు (ఇరిగేపల్లి నుండి)
ఖాదర్ వలి (అగళి) – ఆర్.జీ.పల్లి కి బదిలీ
పీవీ మాధవ – ఇనగలూరు నుండి బదిలీపై వెళ్లారు
ఇదిలా ఉండగా, కొత్తగా బాధ్యతలు స్వీకరించినవారిలో రాఘవేంద్ర ఇరిగేపల్లి ఉన్నత పాఠశాలలో చేరి విధులను చేపట్టినట్లు ఎంఈఓ తెలిపారు. మరిన్ని ఎచ్ఎంలు కూడా త్వరలోనే విధుల్లో చేరే అవకాశముందని మండల విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa