రష్యాతోనే ప్రపంచానికి తక్షణ ప్రమాదమని బ్రిటన్ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. చైనాతో దీర్ఘకాలిక, సాంకేతికపరమైన సవాల్ తప్పదని అభిప్రాయపడింది. ఈ మేరకు బ్రిటన్ ప్రభుత్వం రక్షణ, భద్రతా విశ్లేషణ నివేదికను తాజాగా విడుదల చేసింది. ఈ నివేదిక యునైటెడ్ కింగ్‌డమ్ భౌగోళిక రాజకీయ దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తుంది. రష్యా ప్రస్తుతం ఐరోపా స్థిరత్వానికి ప్రధాన ముప్పుగా వ్యవహరిస్తోందని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతోందని, కాల్పుల విరమణకు విముఖత ఐరోపాలో పెరుగుతున్న ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయని రిపోర్ట్ స్పష్టం చేసింది. బ్రిటన్, NATO సభ్య దేశాలకు నేరుగా సైనిక లేదా సైబర్ ముప్పు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.
చైనా వ్యూహాత్మక సవాల్
చైనా తన ఆర్థిక, సైనిక, సాంకేతిక సామర్థ్యాలను వ్యూహాత్మకంగా ఉపయోగిస్తూ, అంతర్జాతీయ వ్యవస్థను తిరగరాస్తుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. *చైనా నిరంతరం పర్యవేక్షణకు, గూఢచర్యానికి, అంతర్గత చొరబాట్లకు పాల్పడుతున్న దేశం. ఇది ఖచ్చితంగా శాంతికి విఘాతమని స్పష్టమవుతోంది’ అని రిపోర్ట్ వ్యాఖ్యానించింది.
5జీ, ఏఐ, డేటా పరిరక్షణ రంగాల్లో పరిశోధనలతో ఆధిపత్యం సాధించే ప్రయత్నాల్లో చైనా ఉందని పేర్కొంది.
బ్రిటన్ తన రక్షణ వ్యయాన్ని పెంపు, సైబర్ భద్రతా నిర్మాణం బలోపేతం, ఉత్తర అట్లాంటిక్ కూటమి భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేయడంపై యూకే దృష్టిపెట్టింది. ‘ఈశాన్య ఐరోపా నుంచి పసిఫిక్ వరకూ మేము మా భద్రతా ప్రయోజనాలను గట్టిగా నిర్ధారించుకుంటాం. మేము ఏ విధంగానూ వెనక్కి తగ్గం’ అని ఉద్ఘాటించింది. కొనసాగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం, తైవాన్ విషయంలో చైనా దూకుడు నేపథ్యంలో బ్రిటన్ నివేదిక ఈ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనించాల్సిన అంశం.
బ్రెగ్జిట్ తర్వాత అంతర్జాతీయంగా తన స్థానాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నాల్లో బ్రిటన్ ఉంది. ఈ నివేదిక ద్వారా బ్రిటన్ తన ప్రాధాన్య భద్రతా భయాలు, విపత్తులకు ముందు సంసిద్ధత విషయాల్లో స్పష్టమైన వ్యూహం ఏర్పరచుకుందనే స్పష్టమవుతోంది. కాగా, అమెరికా నివేదిక సైతం చైనా చైనా 50 ఏళ్ల తర్వాత ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు వ్యూహాత్మకంగా కదులుతోందని వార్షిక ముప్పు నిర్దారణ పేరుతో విడుదల చేసిన రిపోర్ట్ లో హెచ్చరించింది. ఈ నివేదికను అమెరికా జాతీయ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ కార్యాలయం పార్లమెంటుకు సమర్పించింది. చైనా అమెరికా జాతీయ భద్రతకు అత్యంత దీర్ఘకాలిక, సాంకేతికంగా పెను సవాలు అని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని పెంచుకోవడం, సైనిక శక్తిని విస్తరించటం, ఆర్థిక పరమైన ఆధిపత్యం, ప్రముఖ సంస్థలను నియంత్రించాలనే ఉద్దేశం వంటివి నివేదిక ప్రస్తావించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa