అనకాపల్లి-విశాఖ రోడ్డులోని లంకెలపాలెం జంక్షన్ వద్ద మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన లారీ.. కారు, ఆటోపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారు, ఆటో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఇద్దరు గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa