అంతర్వేది బీచ్ నందు టూరిస్ట్ డెస్టినేషన్ యోగా ఈవెంట్ -2025 కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా దేవ వరప్రసాద్, జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, అమలాపురం ఆర్డీఓ మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ ఇన్ని వేల మంది ఇక్కడ సామూహికంగా యోగ సాధన చేయడం శుభ పరిణామం అని అన్నారు. యోగ తో మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa