మూడు సంవత్సరాలుగా ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఇరు దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే తుర్కియేలోని ఇస్తాంబుల్ వేదికగా సోమవారం రెండో విడత చర్చలు జరిగాయి. రష్యా, ఉక్రెయిన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ చర్చల సందర్భంగా రష్యా పలు కీలక షరతులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తమ షరతులకు అంగీకరిస్తేనే శాంతి ఒప్పందంపై ఆలోచిస్తామని మెలిక పెట్టింది. దీంతో ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల చర్చలు గంటలోపే ముగిశాయి. ఈ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోలేదని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa