ఆంధ్రప్రదేశ్‌లో కలకలం రేపిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుల రిమాండ్ గడువు ఇవాళ్టితో ముగియడంతో పోలీసులు వారిని కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు రిమాండ్‌ను జూన్ 17 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు పోలీసులు నిందితులను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, చాణక్య, దిలీప్, ధనుంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఉన్నారు.
స్కామ్‌కి సంబంధించిన దర్యాప్తు వేగంగా కొనసాగుతుండగా, మరోవైపు నిందితులపై మరిన్ని ముడి తేలే అవకాశముంది. అధికారులు ఈ వ్యవహారంలో ఉన్న అనుమానాస్పద లావాదేవీలపై తీవ్ర దృష్టి సారించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa