జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను తమకు ఆపాదించటంపై వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. పార్టీకి, నాయకులకు ఆపాదిస్తూ టీడీపీ, దానికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. ఈ వ్యవహారానికి రాజకీయాన్ని జోడించి బురదజల్లే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వైయస్ఆర్సీపీ పేర్కొంది. ‘‘జర్నలిస్టు కృష్ణంరాజు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాదు. పాత్రికేయుడిగా ఆయన సాక్షి టీవీ చర్చలో పాల్గొన్నారు. ఆ వ్యాఖ్యలు ఆయనకు సంబంధించినవి. మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు’’అని వైయస్ఆర్సీపీ స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa