యోగా అనేది కేవలం ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కాదు. అది మనసును ఆత్మను తనువును ఏకం చేసి మనిషిలో దివ్యత్వాన్ని నింపే మహోన్నత సాధనం. ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జించవచ్చు. అది జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. అది యోగాతోనే సాధ్యం.భారతదేశం ప్రపంచానికి అందించిన బహుమతి మీ శక్తిని వ్యర్ధమైన మాటల్లో వృధా చేయక ధ్యానం చేయండి మనస్సుశక్తి ని సమీకరించి ఆధ్యాత్మిక శక్తి జనకంగా అవతరించండి.ఏ అనారోగ్యానికైనా మనసే మూల కారణం కనుక, ఏ రకమైన అనారోగ్యమైన మనసులోనే ప్రారంభమవుతుంది, యోగ సాధన ద్వారా మనసు ఎప్పుడైతే నియంత్రించబడుతుందో శరీరంలో ఉండే అనారోగ్యాలు కూడా తొలగించ బడుతుంది.మూలాధార స్థానము నుంచి కుండలిని శక్తి వృద్ధి చెంది స్వాదిష్టానం వరకు చేరుకున్నాక కలిగే సంతానం సమాజానికి ఉపయోగపడే లాగా సజ్జనులు జన్మించడానికి కారణం అవుతుంది కాబట్టి గృహస్థాశ్రమానికి ముందే యోగ సాధన ప్రారంభించిన వారికి ఉత్తమ సంతానం జన్మిస్తారు.యోగము అనే శబ్దానికి మనసు పరమాత్మ యందు లీనమవ్వడం, అలాగే జీవాత్మ పరమాత్మలు ఒకటే అనే అనే భావన బలపడడం లాంటివి ప్రయోజనాలు. కానీ లోకములో వ్యాయామమునకు మాత్రమే యోగా అనే పేరు వస్తోంది. ఈ ఆసనాలు అనేవి అష్టాంగ యోగములో ఒక భాగము మాత్రమే. కాబట్టి వ్యాయామ, ప్రాణాయామ, ప్రత్యాహార, ఆసన, ధారణ, సమాధులు మొదలైనవి. అయితే మిగిలిన వాటికి ప్రాధాన్యత తగ్గిపోవడం వల్ల యోగం యొక్క పూర్తి ప్రయోజనాన్ని పొందలేకపోతున్నాము.
ఎవరికైతే కుండలిని శక్తి:
మణిపూరక చక్రాన్ని దాటినట్లయితే వారు ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులవుతారు
అనాహత చక్రాన్ని దాటినట్లయితే విశ్వప్రేమ గల మహాత్ములవుతారు
విశుద్ధ చక్రాన్ని చేరితే సమాజానికి ఉపయోగపడే సజ్జనులై పరిశుద్ధాత్మలుగా గుర్తించబడతారు
ఆజ్ఞా చక్రాన్ని చేరితే ప్రకృతి శక్తులను స్వాధీనపరచుకొని ప్రకృతి శక్తులను సమాజ శ్రేయస్సు కోసం వినియోగించగలవారు అవుతారు
సహస్రార చక్రాన్ని చేరిన వారు మోక్షాన్ని పొందుతారు
ఇలా కుండలిని శక్తి యొక్క ప్రయోజనాలు చాలా ఉన్నాయి
యోగా వలన ప్రయోజనములు
ఉద్యోగంలో ఉన్నంతవరకు పనిచేస్తే గాని తోచని వారిగా ఉండాలి అప్పుడే అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతారు అలా ఉండటం వలన 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉండే వయసులో ఏ పనికి శరీరం మనసు అలవాటు పడిపోతాయో ఆ పని చేస్తే గాని తోచని మానసిక స్థితి తర్వాత సంవత్సరాల్లో వస్తుంది అలా వచ్చినప్పుడు 60 సంవత్సరములు దాటిన తర్వాత ఉద్యోగ విరమణ తర్వాత అంతకుముందు ఏ పని చేస్తున్నారో అది చేస్తే గాని తోచదు, చేయటానికి ఏమీ ఉండదు. ఇలాంటి పరిస్థితిలో సామాన్యంగా వ్యక్తి డిప్రెషన్ కి లోనవుతాడు. దాన్ని రిటైర్మెంట్ సిక్ నెస్ అంటారు. దాని వలన వ్యక్తికి పనిచేస్తే గాని తోచని పరిస్థితి, పని లేనందు వలన మనిషి తోచకుండా తయారవుతాడు, ఆ మానసిక డిప్రెషన్ ని అధిగమించడానికి మందులు వాడకం జరుగుతుంది, దానివలన వ్యక్తి శరీర అవయవాలు పనిచేయకుండా ఉండటం మనసుతో పాటు జరుగుతుంది, దానివలన వ్యక్తి త్వరితంగా ఇబ్బందులకు గురి అవుతాడు. కాబట్టి ప్రత్యేకంగా వ్యక్తి ఎలా ఉండాలి అంటే విశ్రాంతిలో కూడా ఆనందించే మానసిక పరిస్థితి అలవర్చుకోవాలి.
కౌమార ఆచరే ప్రాజ్ఞః అంటాడు ప్రహ్లాదుడు, అంటే ఆధ్యాత్మిక ఆచరణ అంతా కూడా ఐదవ ఏటికి ముందే ప్రారంభము చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో విన్నవి చదివినవి నేర్చుకున్నవి కూడా మనసుకి పూర్తిగా పడతాయి. కొన్ని అనారోగ్యాలు చేసిన వారికి చిన్నప్పటినుంచి విషయాలు గుర్తుంటాయి ఈ మధ్య కాలములో వి గుర్తుండవు. అలా కాని పక్షంలో కనీసం 30 ఏళ్ల తర్వాత అయినా సరే ఆ వ్యక్తి యోగ సాధన చేస్తూ విశ్రాంతిలో కూడా ఆనందించే మానసిక స్థితిని అభ్యసిస్తే పరవాలేదు, లేనిపక్షంలో ఆ వ్యక్తి రిటైర్మెంట్ సిగ్నెస్ అనేది వచ్చి త్వరగా ఇబ్బందులకు గురి అవుతాడు. అందువలన యోగం అనేది నిత్యావసరము.
హఠయోగమనేది పతంజలి చెప్పిన విధానాలలో ఒకటి. సిబివి మాస్టర్ ఎక్కిరాల హటయోగాన్ని బాగుగా అధ్యయనం చేశారు.ప్రపంచంలోని మేధావి వర్గం అంతా యోగ సాధన ద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అనే విషయాన్ని నిర్ధారణ చేసేశారు.
మహర్షి మహేష్ యోగి ఈ సాధన ద్వారానే దేశ విదేశాల్లో స్థావరాలు ఏర్పరచుకొని సుమారు 180 దేశాల్లో ప్రచారం చేశారు. సుమారు దీని మీద 500 పరిశోధనలు జరిగాయి. ఆధునికమైన వైద్య విధానము కూడా యోగసాధన గొప్పతనాన్ని గుర్తించింది. ఆ కారణం గానే యోగ నేర్చుకోవడానికి కూడా ఇన్సూరెన్స్ మొదలైనవి ఇస్తున్నాయి మిగిలిన దేశాల్లో.
పత్రీజీ యోగ సాధనలో భాగమైన ధ్యానాన్ని ప్రచారం చేసి ఎన్నో అనారోగ్యాల్ని తగ్గించుకునే విధానాన్ని చెప్పారు. స్వయంగా ఎవరికి వారు తగ్గించుకునే విధానాలను రూపొందించారు. ప్రాణిక్ హీలింగ్ అనే ప్రచారం ద్వారా ఫిలిప్పైన్ దేశానికి చెందిన చావకోక్ సుయి అనే ఆయన యోగ సాధన ద్వారానే ఒక హీలింగ్ విధానాన్ని ప్రసారం చేశారు. యోగ విధానాల్లో చిన్న చిన్న భాగాలను తీసుకుని దాన్నే సకల సమగ్రమైన హీలింగ్ విధానాలుగా ప్రచారం చేస్తున్నారు.
భారతదేశంలో పుట్టిన విశ్వజనీయతమైన యోగ వివిధ దేశాలకు పాకింది. భారతీయానికి గుర్తులయిన ఆఫ్ఘనిస్తాన్ లో శివలింగం, అమెరికాలో శ్రీ చక్రం, రెడ్ ఇండియన్స్ హోమం చేయడం , మయ కల్చర్ లో హోమాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5వేల గ్రామాలకు రామా అనే పదముతో పేరులు ఉన్నాయి . రాముడు పుష్పక విమానం ద్వారా దేశాలు తిరిగి జయించుకు వచ్చాడు. ఎక్కిరాల వేదవ్యాస వివిధ దేశాలలో ఉన్న హిందూ మతం చిహ్నాలు అనే పుస్తకాన్ని రాశారు.
యోగ సాధన ద్వారా కలిగే ఆరోగ్యం ఆనందం గొప్పవి. భోగాల ద్వారా వచ్చేది రోగం. రకరకాల జంక్ ఫుడ్ అని తిని రోగనిరోధక శక్తిని తగ్గించుకోవడం వల్ల ఇతర దేశాలలో మరణాల సంఖ్య పెరిగింది. భారతదేశంలో ఆ సంఖ్య తక్కువగా ఉండడానికి కారణం యోగ సాధన, ఆహార నియమాలు, సూర్యుని యొక్క కాంతి కిరణాలు అధికంగా స్వీకరించగలడం, గోత్రాలు మొదలైనవి చూసుకొని వివాహాలు చేసుకోవడం. పూర్వకాలంలో ఋషులు అనేక సంవత్సరాలు జీవించటానికి కారణం యోగ సాధన. త్రిలింగ స్వామి 300 సంవత్సరాలు బ్రతికినట్లు చెప్తారు.
జ్యోతిష్యంలో మాత్రమే సహస్రవర్ష జీవనం అనే యోగం ఉంది అంటే 1000 సంవత్సరాలు వ్యక్తి జీవించే యోగం. అది మిగిలిన ఏ శాస్త్రాల్లోనూ లేదు. కానీ 10 సంవత్సరాలు క్రితం పేపర్లో వెయ్యి సంవత్సరాల వ్యక్తి జీవించవచ్చు అని సైంటిస్టులు రాశారు. వ్యాయామ ప్రాణాయామాలు, ఆహార నియమాలు ద్వారా వ్యక్తి అంత కాలము జీవించవచ్చు అని వ్రాశారు.
ఒక 85 సంవత్సరాల టిబెటన్ యోగి సునాయాసంగా యోగా చేస్తుంటే ఒక విలేఖరి ప్రశ్నించారు ఈ వయసులో శరీరాన్ని ఎందుకు కష్టపడుతున్నారు అని. దానికి యోగి ఆనందంగా మరణిద్దామని అని సమాధానం చెప్పాడు. అంటే సాధారణంగా మరణము అనేది ఏదైనా రోగంతోనే జరుగుతుంది ఇస్తే మరుజన్మకు కూడా అదే రోగము కంటిన్యూ అవుతుంది. ఎందుకు అంటే భగవద్గీతలో చెప్పాడు ఏ భావాన్ని అయితే కలిగి ఉంటే శరీరాన్ని విడిచి పెడతారో మరుజన్మకు అదే భావం కొనసాగుతుంది. బాధతో మరణిస్తే బాధే కొనసాగుతుంది.
ఒక వ్యక్తికి నడ్డి మీద పోటు వస్తుంటే, ఎన్ని మందులు వాడుతున్న తగ్గక పోతుంటే హిప్నోథెరపిస్ట్ దగ్గరికి వెళ్లారు, పూర్వ జన్మకి తీసుకెళ్తే అతను చెప్పాడు, కత్తిపోటుతో మరణించినట్టు, ఆ కత్తి పోటు ఎక్కడైతే తగిలిందో ఆ బాధతో ఆ వ్యక్తి మరణించి అదే శరీర భాగంలో బాధ కొనసాగుతుంది ఇప్పటికీ కారణం లేకుండా మందులకి లొంగకుండా ఆ నొప్పి.
రావణాసురుడు రాముడు చంపుతుంటే ఈ రాముడు విభీషణుడు కలిసి ఇంటిగుట్టు లంకకు చేటు అన్నట్టుగా విభీషణుడు చెప్పిన రహస్యాలన్నిటిని తెలుసుకొని రాముడు నా వాళ్ళందరిని చంపేశాడు, ఇప్పుడు నన్ను కూడా చంపేస్తున్నాడు అని తిట్టుకుంటూ తిట్టుకుంటూ చనిపోయాడు. ఆ కారణం వల్ల మరుజన్మలో తిట్టడం ఒక్కటే చేశాడు శిశుపాలకుడుగా. మామూలుగా రాక్షసులు చేసినట్టుగా ఋషులని చంపడం అలాంటి మొదలైన చెడ్డ పనిలేవి చేయలేదు. టిబెట్ యోగి ఏం చెప్తున్నాడంటే బాధతో మరణించడం వల్ల బాధ మయంగా ఉంటుంది కాబట్టి ఆనందంగా మరణించాలంటే ఆరోగ్యంగా ఆనందంగా మరణించాలి, దానికోసం నేను యోగ చేస్తున్నాను అని చెప్పాడు. ఆనందముగా మరణించటము అంటే ఆనంద స్వరూపుడైన భగవంతున్ని ధ్యానిస్తూ మరణించటం అదే మోక్షము. మోక్షం అనేది సహజ స్థితి కోరికలు ఎప్పుడైతే తగ్గిపోతాయో మోక్షం పొందుతారు వ్యక్తి.
దేవుడు కూడా మనిషిగా పుట్టాక సుఖదుఃఖాలు తప్పవు కాబట్టి పరిపూర్ణ ఆనంద స్థితి మోక్షంలోనే ఉంటుంది కాబట్టి ప్రతి వ్యక్తి దానికోసం కృషి చేయాలి కాబట్టి దానికి యోగ సాధన తప్పదు.
ప్రపంచ వ్యాప్తంగా రోగ నిరోధక శక్తిని పెంచే మందు లేదు. యోగ సాధన ద్వారానే అది సాధ్యం.
ప్రపంచంలోని మనుషుల అందరి మనసులు ద్వేషరహితంగా చేసి ఒక కుటుంబం గా చేసే శక్తి యోగాకి మాత్రమే ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ యోగ చేయండి మానసిక శారీరక ఆరోగ్యాలని పెంచుకుంటూ ఆనందాన్ని పంచుకుంటూ మోక్షమార్గము కొరకై ప్రయత్నాన్ని చేసి విజయాన్ని సాధించండి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa