భారత ప్రధాని నరేంద్ర మోదీ సైప్రస్ పర్యటనలో భాగంగా నిన్న ఆ దేశంలో అడుగుపెట్టారు. రెండు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని సైప్రస్‌లో పర్యటించడం ఇదే ప్రథమం కావడంతో ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది. అక్కడ స్థిరపడిన ప్రవాస భారతీయులు ప్రధాని మోదీకి అత్యంత ఉత్సాహంగా, ఆత్మీయంగా స్వాగతం పలికారు. ఈ ఘన స్వాగతానికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సైప్రస్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.ఆదివారం సైప్రస్ రాజధాని నికోసియాకు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్, ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ ప్రత్యేక ఆదరణకు గాను ఆ దేశ అధ్యక్షుడికి ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa