ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 షెడ్యూల్‌ విడుదల..

international |  Suryaa Desk  | Published : Wed, Jun 18, 2025, 04:23 PM

గత టీ20 ప్రపంచకప్‌ విజేత న్యూజిలాండ్‌ (PC: ICC) మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 (ICC Women's T20 World Cup) షెడ్యూల్‌ విడుదలైంది. ఇంగ్లండ్‌ వేదికగా ఈ ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్‌ 12న తెర లేవనుంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ICC) ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్లో పన్నెండు జట్లు భాగం కానున్నాయి. భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు.. గ్లోబల్‌ క్వాలిఫయర్స్‌ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి. ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్తాన్‌తో పాటు మరో రెండు జట్లు.. గ్రూప్‌-బి నుంచి ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు మరో రెండు టీమ్‌లు పోటీపడనున్నాయి. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి న్యూజిలాండ్‌ కాగా చివరగా 2024లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో న్యూజిలాండ్‌ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్‌-2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 33 మ్యాచ్‌లు జరుగనున్నాయి. కాగా ఎడ్జ్‌బాస్టన్‌, హాంప్‌షైర్‌ బౌల్‌, హెడ్డింగ్లీ, ఓల్డ్‌ ట్రఫోర్డ్‌, ది ఓవల్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌, లార్డ్స్‌ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇంగ్లండ్‌- శ్రీలంక మధ్య మ్యాచ్‌తో జూన్‌ 12న మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌తో ముగియనుంది. భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌ అప్పుడే.. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. జూన్‌ 14న ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ జరుగనుంది. అనంతరం గ్లోబ్‌ క్వాలిఫయర్‌ నుంచి వచ్చిన టీమ్‌తో జూన్‌ 17న భారత్‌ తలపడుతుంది. ఆ తర్వాత జూన్‌ 21న సౌతాఫ్రికాతో, జూన్‌ 25న క్వాలిఫయర్‌ జట్టుతో, జూన్‌ 28న పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 పూర్తి షెడ్యూల్‌ జూన్‌ 12- శుక్రవారం- ఇంగ్లండ్‌ వర్సెస్‌ శ్రీలంక, ఎడ్జ్‌బాస్టన్‌ జూన్ 13- శనివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్‌ 13- శనివారం: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్‌ 13- శనివారం: వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్జూన్‌ 14- ఆదివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఎడ్జ్‌బాస్టన్‌ జూన్‌ 14- ఆదివారం: ఇండియా vs పాకిస్తాన్, ఎడ్జ్‌బాస్టన్జూన్‌ 16- మంగళవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్జూన్‌ 16- మంగళవారం: ఇంగ్లండ్‌ vs క్వాలిఫయర్‌, హాంప్‌షైర్‌బౌల్‌ జూన్‌ 17- బుధవారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్‌, హెడ్డింగ్లీ జూన్‌ 17- బుధవారం: ఇండియా vs క్వాలిఫయర్‌, హెడ్డింగ్లీ జూన్‌ 17- బుధవారం: సౌతాఫ్రికా vs పాకిస్తాన్‌, ఎడ్జ్‌బాస్టన్‌ జూన్‌ 18- గురువారం: వెస్టిండీస్‌ vs క్వాలిఫయర్‌, హెడ్డింగ్లీ జూన్‌ 19- శుక్రవారం: న్యూజిలాండ్‌ vs క్వాలిఫయర్‌, హాంప్‌షైర్‌ బౌల్‌ జూన్‌ 20- శనివారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్‌, హాంప్‌షైర్‌ బౌల్‌ జూన్‌ 20- శనివారం: ఇంగ్లండ్‌ vs క్వాలిఫయర్‌, హెడ్డింగ్లీ జూన్‌ 21- ఆదివారం: వెస్టిండీస్‌ vs శ్రీలంక, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌ జూన్‌ 23- మంగళవారం: న్యూజిలాండ్‌ vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌ జూన్‌ 23- మంగళవారం: శ్రీలంక vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌ జూన్‌ 23- మంగళవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్‌, హెడ్డింగ్లీ జూన్‌ 24- బుధవారం: ఇంగ్లండ్‌ vs వెస్టిండీస్‌, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ జూన్‌ 25- గురువారం: ఇండియా vs క్వాలిఫయర్‌, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్‌ 25- గురువారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌ జూన్‌ 26- శుక్రవారం: శ్రీలంక vs క్వాలిఫయర్‌, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్‌ 27- శనివారం: పాకిస్తాన్‌ vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌ జూన్‌ 27- శనివారం: వెస్టిండీస్‌ vs క్వాలిఫయర్‌, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌  జూన్‌ 27- శనివారం: ఇంగ్లండ్‌ vs న్యూజిలాండ్‌, ది ఓవల్‌ జూన్‌ 28- ఆదివారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్‌, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌. జూన్‌ 28- ఆదివారం: ఆస్ట్రేలియా vs ఇండియా, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌. జూన్‌ 30- మంగళవారం: సెమీ ఫైనల్‌ 1- ది ఓవల్‌ జూలై 2- గురువారం: సెమీ ఫైనల్‌ 2- ది ఓవల్‌ జూలై 5- ఆదివారం: ఫైనల్‌, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa