బరువు తగ్గడం కొందరికి కేవలం ఫిట్ నెస్ గోల్ మాత్రమే కావచ్చు. కానీ కొందరికి మాత్రం అదో ఎమోషనల్ జర్నీ. అనుకోకుండా భారీగా బరువు పెరిగిపోయి బాడీ షేమింగ్ కి గురై..ఆ తరవాత బరువు తగ్గాలని ప్రయత్నాలు మొదలు పెడతారు. కానీ..అదంత సులువైన పని కాదని అర్థమైపోతుంది. అయినా కూడా పట్టు వదలకుండా ప్రయత్నించి సక్సెస్ అయిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు అలాంటి కథ గురించే చెప్పుకోబోతున్నాం. దాదాపు 150 కిలోల బరువు ఉన్న ఓ యువతి 80 కిలోల బరువు తగ్గించుకుంది. ఇది నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుండొచ్చు. కానీ..చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతూ, ఎక్కడా వెనకడుగు వేయకుండా ట్రై చేసి ఫిట్ నెస్ ని సాధించుకుంది.
నమ్మకం లేకుండానే
150 కిలోల బరువు పెరిగినప్పుడు ఇక వెయిట్ లాస్ అవ్వడం కష్టమే అనిపిస్తుంది. అసలు ఆ ప్రయత్నం చేయాలన్నా చాలా మంది నెర్వస్ గా ఫీల్ అవుతారు. కానీ...ప్రంజల్ పాండే మాత్రం తగ్గేదే లేదు అని పంతం పట్టింది. వెయింగ్ మెషీన్ లో ఎప్పుడూ మూడంకెల నంబర్ చూసే తాను..ఇప్పుడు రెండంకెలను చూస్తోంది. ఇదో పెద్ద మిరాకిల్ అని చెబుతోంది. ఈ జర్నీ అంతా చాలా ఎమోషనల్ గా సాగింది. ఎన్నో సార్లు కన్నీళ్లు పెట్టుకుంది. అసలు ఇప్పుడు అద్దం ముందు నిలబడితే తనను తానే నమ్మలేనంతగా బరువు తగ్గిపోయింది. లైఫ్ స్టైల్ లో ఎన్నో మార్పులు చేసుకుంటే కానీ ఇది సాధ్యపడలేదు. కేవలం డైట్, వర్కౌట్స్ మాత్రమే కాదు. మరి కొన్ని టిప్స్ ఫాలో అవుతూ బరువు తగ్గింది ప్రంజల్. ఆ టిప్స్ ఏంటో చూద్దాం.
ఏ డైట్ ఫాలో అయిందంటే
బరువు తగ్గాలంటే ముందుగా ఫ్యాట్ మొత్తం బర్న్ అయిపోవాలి. అందుకోసం ప్రంజల్ కొన్ని అలవాట్లు చేసుకుంది. గోరు వెచ్చని నీళ్లు తాగడం మొదలు పెట్టింది. దీంతో పాటు నిమ్మరసం తప్పనిసరిగా తీసుకుంది. లేదా యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకునేది. ఇలా రెగ్యులర్ గా పరగడుపున తీసుకోవడం అలవాటు చేసుకుంది. గోరు వెచ్చని నీళ్లు తీసుకోవడం వల్ల పొట్టలో ఉన్న మలినాలు అన్నీ బయటకు వెళ్లిపోతాయి. పైగా కొవ్వు చాలా త్వరగా కరిగిపోయేందుకు అవకాశముంటుంది. ఇక ఆహారం విషయానికొస్తే..ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని చెబుతోంది ప్రంజల్. అంటే ఫిష్, ప్రాన్స్,ఎగ్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు పనీర్, తోఫు, గ్రీక్ యోగర్ట్, సోయా చంక్స్ కూడా డైట్ లో చేర్చుకోవాలని చెప్పింది.
మరి కొన్ని టిప్స్
భోజనం చేసే ప్రతిసారీ ముందు ఓ సలాడ్ తీసుకోవాలి. క్యారెట్స్, కీర దోసకాయ లాంటివి తీసుకుంటే మంచిది. వీటితో పాటు కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే..పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. కచ్చితంగా రోజూ నాలుగు లీటర్ల నీళ్లు తాగుతూ బరువు తగ్గింది ప్రంజల్. డైట్ సంగతి సరే. కానీ..ఆ ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందన్నది చెక్ చేసుకోవాలి. నట్స్, సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. భోజనంలో పప్పు ఉండేలా చూడాలి. అన్నంతో పాటు క్యారెస్ట్, కీర తింటూ ఉండాలి. పనీర్ లేదా ఫ్రైడ్ చికెన్ డైట్ లో చేర్చుకుంటే మంచిది. వెజిటేరియన్ అయితే పనీర్ కి పరిమితం అయితే సరిపోతుంది.
రోజూ వాకింగ్
డైట్ మాత్రమే కాదు. ఫిజికల్ యాక్టివిటీపైనా ఫోకస్ చేసింది ప్రంజల్. అయితే..ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయిన రూల్ ఏంటంటే..రోజూ కచ్చితంగా వాకింగ్ చేయడం. భోజనం చేసిన తరవాత కనీసం 10 నిముషాల పాటు వాకింగ్ చేసింది. ఒకవేళ వాకింగ్ కి వెళ్లే అవకాశం లేనప్పుడు కనీసం 10 నుంచి 15 స్క్వాట్స్ చేసేది. ఇలా చేయడం వల్ల కొవ్వు త్వరగా కరిగిపోయింది. ఇక మరో రూల్ ఏంటంటే...నిద్రపోవడానికి కనీసం మూడు గంటల ముందే డిన్నర్ పూర్తి చేయడం. ప్రతి భోజనంలోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంది. ఇక వీటితో పాటు రోజూ జిమ్ కి వెళ్లడం వర్కౌట్స్ చేయడం, జాగింగ్, రన్నింగ్ లాంటివీ తన వెయిట్ లాస్ ప్లాన్ లో చేర్చుకుంది.
లైఫ్ స్టైల్ మార్పులు తప్పనిసరి
ఎన్ని చేసినా సరే. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోకపోతే మాత్రం మళ్లీ కథంతా మొదటికే వస్తుంది. అందుకే..ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని చెబుతోంది ప్రంజల్ పాండే. కేవలం డైట్, వర్కౌట్ రొటీన్స్ వల్లే ఇది సాధ్యం కాదు. చాలా కచ్చితంగా రూల్స్ పెట్టుకోవాలి. వాటిని బ్రేక్ చేయకూడదు. పూర్తిగా డెడికేషన్ తో ప్రయత్నం చేయాలి. ఇలా చేస్తే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదని చెబుతోంది ప్రంజల్. సో..ఇదన్నమాట ఆమె వెయిట్ లాస్ జర్నీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa