షుగర్ ఉన్నవారు రెగ్యులర్‌గా వర్కౌట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే, వర్కౌట్ ఇన్సులిన్ చర్యని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేస్తుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది. వర్కౌట్ కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్, అధిక బరువు తగ్గుతాయి. బరువు తగ్గితే ఆటోమేటిగ్గా షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. ఎందుకంటే ఊబకాయం ఉన్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉండి 40 ఏళ్ళు దాటిన వారు ఎవరైనా సరే వారానికి కనీసం రెండు, మూడు రోజులు స్ట్రెంథ్ ట్రైనింగ్ చేయాలి. వీటి వల్ల బ్యాలెన్స్ పెరుగుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వారానికి 150 నుండి 300 నిమిషాల పాటు మోడరేట్ ఇంటెన్సిటీ యాక్టివిటీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. వారానికి రెండు సార్లు రెసిస్టెన్స్ ట్రైనింగ్ సెషన్ చేయడం వల్ల హైబీపి తగ్గుతుంది. బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హిమోగ్లోబిన్ A1C స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె జబ్బులు తగ్గుతాయి. మీ డెయిలీ రొటీన్‌లో కొన్ని వర్కౌట్స్ ఉన్నాయి. వీటిని చేసే ముందు డాక్టర్ సలహా తీసుకోండి. మొదట కొద్దికొద్దిగా చేస్తూ పెంచుకుంటూ పోవాలి.
వెయిట్ ట్రైనింగ్
వెయిట్ ట్రైనింగ్ అనేది డయాబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాకుండా అందరికీ హెల్ప్ చేస్తుంది. వెయిట్ ట్రైనింగ్ వల్ల మజిల్ మాస్ పెరుగుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి చాలా బెనిఫిట్స్‌ని అందిస్తుంది. మీ మజిల్ మాస్ తగ్గితే రక్తంలో చక్కెరని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. డయాబెటిస్ కంట్రోల్ చేయడంలో భాగంగా వారానికి కనీసం రెండుసార్లు రెసిస్టెన్స్ వర్కౌట్, వెయిట్ ట్రైనింగ్ చేయాలి.
యోగా
షుగర్‌ని కంట్రోల్ చేయడంలో యోగా కూడా హెల్ప్ చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడానికి, పరిస్థితిని మేనేజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు మీ రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. కాబట్టి, ఒత్తిడిని తగ్గించే యోగా చేయడం మంచిది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి యోగా చాలా బాగా హెల్ప్ చేస్తుంది.
సోలియస్ పుషప్స్
కొన్ని అధ్యయనాల ప్రకారం సోలియస్ మజిల్ మోకాలి నుండి మడమ వరకూ ఉంటుంది. దీని వల్ల చీలమండని వంచడంలో హెల్ప్ చేయడం, లేచి నిలబడేందుకు, నడవడానికి, బ్యాలెన్స్ చేయడానికి వీలు చేస్తుంది. సోలియస్ నెమ్మదిగా సంకోచించే కండరాల ఫైబర్‌తో కూడి ఉంటుంది. ఇది ఎండ్యూరెన్స్ పనులకి బాగా సరిపోతుంది. ఇందులో కాఫ్ రైజెస్, హీల్ డ్రాప్స్ వర్కౌట్స్‌లో సోలియస్‌ని ఎంగేజ్ చేయడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం పెరుగుతుంది. కణాలు ఇన్సులిన్‌కి మరింత ప్రతిస్పందిస్తాయి. గ్లూకోజ్ తీసుకోవడం మెరుగవుతుంది. ఈ ఒక్క వర్కౌట్ డయాబెటిస్‌ని మేనేజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. దీని వల్ల లాభాలేంటంటే
బెనిఫిట్స్
మెరుగైన రక్తప్రసరణసోలియస్ వర్కౌట్ రక్తప్రవాహాన్ని పెంచుతుంది. శరీర కణాలకు గ్లూకోజ్, ఆక్సిజన్‌ని సమర్థవంతంగా సరఫరా చేయడంలో సాయపడతాయి. దీని కారణంగా రక్తంలో చక్కెర నియంత్రణ పెరుగుతుంది.కేలరీలు ఖర్చవ్వడంసోలియస్ వర్కౌట్‌తో కేలరీలు ఖర్చవుతాయి. దీంతో బరువు తగ్గుతారు. ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని తగ్గిస్తుంది. భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగడంముఖ్యంగా భోజనం తర్వాత సోలియస ఫోకస్డ్ వర్కౌట్‌తో భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరుగదలని తగ్గించడంలో సాయపడుతుంది. డిన్నర్ తర్వాత కొద్దిగా నడవడం మంచిదని గుర్తించండి. సోలియస్ వర్కౌట్స్ సాధారణంగా తక్కువ ప్రభావం చూపుతాయి. రోజువారీ వర్కౌట్స్ ఈజీగా చేయొచ్చు.
సోలియస్ వర్కౌట్స్‌లో రకాలు
కాఫ్‌రైజెస్ : పాదాలను తుంటి వెడల్పుతో వేరుగా ఉంచి మీ మడమలని నేల నుండి ఎత్తి, మీ పాదాలతో పైకి లేవండి. వెనక్కి తగ్గండి.
హీల్ డ్రాప్స్ : ఎత్తైన ప్రదేశంపై మడమలపై నిలబడండి. మీ మడమలను కిందకి వంచి, ఆపై తిరిగి పైకి ఎత్తండి. సీటెడ్ హీల్ రైజెస్ : పాదాలను నేలపై చదునుగా ఉంచి హాయిగా కూర్చోండి. మడమలని నేల నుండి ఎత్తి, కాలి వేళ్లని పైకప్పు వైపు చూపిస్తూ, ఆపై వాటిని తిరిగి క్రిందికి దించండి. గమనిక :ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏ మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించేముందు మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి. తెలుగు సమయం ఈ విషయాల్ని ధృవీకరించడం లేదు. ఖచ్చితత్వం, ప్రభావానికి సమయం తెలుగు బాధ్యత వహించదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa