ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా వీసా ఇంటర్వూలు రీస్టార్ట్.. వాటికి మాత్రం డేంజర్

international |  Suryaa Desk  | Published : Fri, Jun 20, 2025, 07:47 PM

అమెరికాలో చదువుకోవాలని కలలు కంటున్న విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు శుభవార్త. కొన్నాళ్లుగా ఆగిపోయిన అమెరికాస్టూడెంట్ వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ మళ్లీ మొదలైంది. అయితే, అమెరికా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. అదేంటంటే, వీసా కోసం అప్లై చేసే ప్రతి విద్యార్థి సోషల్ మీడియా ఖాతాలను తప్పకుండా చెక్ చేస్తారు. ఈ కొత్త గైడ్‌లైన్స్‌ను అమెరికా విదేశాంగ శాఖ తాజాగా విడుదల చేసింది.


సోషల్ మీడియా వెట్టింగ్ అంటే ఏంటి?


ఈ "సోషల్ మీడియా వెట్టింగ్" అనేది అమెరికాలోకి రావాలనుకునే ప్రతి వ్యక్తిని పక్కాగా పరిశీలించడానికి ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. వీసా అప్లికేషన్ పెట్టుకున్న విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను అమెరికా కాన్సులర్ అధికారులు చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. దీని కోసం అప్లై చేసే వాళ్లు తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఉండే ప్రైవసీ సెట్టింగ్స్‌ను మార్చుకుని, వాటిని పబ్లిక్ ఆప్షన్‌లో పెట్టుకోవాలి. అప్పుడే అధికారులు వాటిని చెక్ చేయగలరు.


ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా అప్లై చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలను ఆపేశారు. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం, అందుకే వీసాలు ఆపామని అప్పట్లో విదేశాంగ శాఖ చెప్పింది. ఇప్పుడు ఆ సన్నాహాలు పూర్తవడంతో, సోషల్ మీడియా వెట్టింగ్‌ను తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్‌మెంట్ ప్రక్రియను మళ్ళీ స్టార్ట్ చేశారు.


ఎందుకు ఈ సోషల్ మీడియా చెకింగ్?


వీసా అప్లై చేసిన విద్యార్థులకు పర్మిషన్ ఇవ్వొచ్చా లేదా అని తెలుసుకోవడానికి, వాళ్ల ఆన్‌లైన్ యాక్టివిటీస్‌ను అధికారులు చెక్ చేస్తారు. ఇదే 'సోషల్ మీడియా వెట్టింగ్'. విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్ చూసిన తర్వాతే వీసా ఇస్తారు. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే, దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనేది అమెరికా ఉద్దేశం.


ఉదాహరణకు, ఎవరైనా స్టూడెంట్ తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పాలస్తీనా జెండాను పోస్ట్ చేస్తే, ఆ వ్యక్తిని మరింత డీటెయిల్‌గా పరిశీలిస్తారు. వాళ్ల వల్ల దేశ భద్రతకు ఎలాంటి ప్రమాదం లేదని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే వారిని అమెరికాలోని యూనివర్సిటీల్లో చదువుకోవడానికి అనుమతిస్తారు. అప్పుడే వాళ్లకి స్టూడెంట్ వీసా వస్తుంది. అంటే, మీ సోషల్ మీడియా పోస్ట్‌లు, లైక్స్, షేర్స్ అన్నీ వాళ్లు చూస్తారన్నమాట. కాబట్టి, అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులు తమ సోషల్ మీడియా ఖాతాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి! అనవసరమైన, వివాదాస్పద పోస్టులు ఉంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది.


అయితే మేఘా వేమూరి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్నది పాలస్తీనా ప్రజల కష్టాలతో పోలిస్తే చాలా తక్కువ అని.. వారి ఆశయానికి తాను సహాయపడాలంటే ఇంకా ఎక్కువ భరించగలనని తెలిపారు. తనకు తన కుటుంబం అండగా నిలిచిందని.. ఎంఐటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో రెండో రోజు తమను అనుమతించకపోవడంతో తాను ఏ మాత్రం నిరాశపడలేదని ఆమె తేల్చి చెప్పారు. పాలస్తీనా మారణహోమంలో భాగస్వామి అయిన ఒక సంస్థ వేదికపై తాను నడవాల్సిన అవసరం లేదని భావిస్తున్నానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే ఎలాంటి అర్హత లేకుండా లేదా సరైన ప్రక్రియ లేకుండా నిర్దిష్ట విధానాన్ని ఉల్లంఘించారన్న సూచన లేకుండా తనను శిక్షించడానికి ఎంఐటీ అధికారులు తమ పరిధిని దాటినందుకు తాను నిరాశ చెందినట్లు ఆమె తెలిపారు. ఎంఐటీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో న్యూరోసైన్స్ గ్రాడ్యుయేట్ అయిన మేఘా వేమూరి.. తన లింక్డిన్, ఎక్స్ ఖాతాలను తొలగించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa