ఫ్రై చేసిన ఫుడ్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తినొద్దని చెప్పినప్పటికీ కొన్నిసార్లు మనకి తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు అప్పుడప్పుడు తింటూ మన క్రేవింగ్స్‌ని చల్లార్చుకుంటాం. అయితే ఆ క్రేవింగ్స్‌ని కూడా హెల్దీగా సాటిస్‌ఫై చేసుకోవాలనుకుంటే మనం వాటిని హెల్దీగా చేసుకోవచ్చు.
ఎంత హెల్దీ డైట్ ఫాలో అయిన కొన్ని సార్లు మనకి ఫ్రైడ్ ఫుడ్స్, స్నాక్స్, పకోడా, బజ్జీలవంటివి తినాలనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఇలాంటి స్నాక్స్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే, వీటిని తినడం వల్ల చాలా మంది హెల్త్‌పై నెగెటీవ్ ఎఫెక్ట్ పడుతుంది. ఎక్కువగా ఈ ఆయిల్ తీసుకునేవారికి సమస్య ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు మనం వాడే నూనె రకంపై కూడా ఆధారపడి ఉంటుంది. వేడి నూనెలో మనం ఫుడ్‌ని ఫ్రై చేయడం వల్ల కొంత ఎఫెక్ట్‌ని చూపిస్తుంది. డీప్ ఫ్రైయింగ్ అంటే ఫుడ్ ఆహారాన్ని వేడినూనెలో ఫ్రై చేయడం. సరైన టెంపరేచర్‌లో ఫుడ్‌ని ఫ్రై చేయడం. అయితే, ఈ డీప్ ఫ్రైకి ఏ నూనె అయితే మంచిదో తెలుసుకుని దాంతోనే వంట చేయడం మంచిది. దీంతో హానికరమైన సమ్మేళనాలు ఏర్పడవు.
ఎక్కువగా సంతృప్త, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉన్న నూనెలు డీప్ ఫ్రై చేయడానికి మంచివి. ఎందుకంటే అవి అధిక వేడి వద్ద స్థిరంగా ఉంటాయి.
కొబ్బరినూనె
కొబ్బరినూనెలో 90 శాతం కంటే ఎక్కువగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇది వేడికి నిరోధకతని కలిగి ఉంటాయి. దీంతో ఫ్రైలకి ఇది మంచి ఆయిల్. కొబ్బరినూనెని ఎంచుకునేటప్పుడు కొన్ని రకాలు అందరికీ నచ్చవు. వాటి రుచి, వాసన సరిగా ఉండదు. కాబట్టి, కొన్ని బ్రాండ్స్ మాత్రమే ట్రై చేయండి. ఈ నూనెలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది స్థిరంగా ఉంటుంది. డీప్ ఫ్రైయింగ్ టైమ్‌లో నాణ్యత మారదు. కొబ్బరినూనె వేయించడానికి మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
పీనట్ ఆయిల్
పల్లీ నూనె కూడా హై స్మోక్ పాయింట్‌ని కలిగి ఉంటుంది. ఇది డీప్ ఫ్రైకి చాలా బెస్ట్. ఇది కొన్ని వంటకాలకి అంతగా సెట్ కాకపోవచ్చు. ఇందులో 32 శాతం పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. దీంతో ఎన్నోహెల్త్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసుకోవచ్చు.
అవకాడో ఆయిల్
అవాకాడో ఆయిల్‌లో ముఖ్యంగా మోనో అన్‌శాచురేటెడ్, కొన్ని సంతృప్త, బహుళ అసంతృప్త కొవ్వులు కలిపి ఉంటాయి. రిఫైండ్ అవకాడో ఆయిల్ హై స్మోక్ పాయింట్ ఉంటుంది. నట్టీ ఫ్లేవర్ ఉంటుంది. దీనిని ఎక్కువగా వాడరు. కానీ, ఇది కూడా ఫ్రైల కోసం బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఈ నూనెతో వండిన వంటల్లో ఎక్కువగా ప్రమాదకరమైన పదార్థాలు ఉండవు.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ హెల్దీ ఫ్యాట్స్‌లో ఒకటి. ఇది వేడికి నిరోధకతని కలిగి ఉంటుంది. ఎందుకంటే, జంతువుల కొవ్వుల మాదిరిగానే, ఇది మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వు ఫ్యాటీ యాసిడ్స్‌లలో అధికంగా ఉంటుంది. ఆలివ్ ఆయిల్‌ని ఎక్కువసేపు వేడి చేసినప్పుడు దాని రుచి, వాసన తగ్గుతుంది.
నెయ్యి
నెయ్యి కూడా అధిక వేడికి నిరోధకతని కలిగిస్తాయి. అయితే, ఇది జంతువుల నుంచి తయారైన ఆహారం.. కాబట్టి, జంతువులు తినే ఆహారాన్ని బట్టి కొవ్వు ఆమ్ల కంటెంట్ మారుతుంది. ధాన్యం తినే జంతువుల కొవ్వు నిల్వలలో పచ్చిక బయళ్లలో పెరిగిన, గడ్డి తినే జంతువుల కంటే ఎక్కువ పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.
పామాయిల్
పామాయిల్ కూడా ఎక్కువగా సంతృప్త, మోనో శాచురేటెడ్ కొవ్వులని కలిగి ఉంటుంది. ఇది డీప్ ఫ్రైకి బెస్ట్ ఆప్షన్. రుచి బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. రెడ్ పామాయిల్ కంటే చాలా బెస్ట్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa