ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘విద్యాశక్తి’ని విజయవంతం చేద్దాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 25, 2025, 01:11 PM

చదువులో వెనకబడిన పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక బోధనా తరగతుల కార్యక్రమం ‘విద్యాశక్తి’ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ వి.విజయరామరాజు కోరారు. విద్యాశక్తిపై మంగళవారం విజయవాడలో ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సబ్జెక్టుల్లో వెనకబడిన విద్యార్థులకు పాఠశాలల పనివేళల అనంతరం అదనపు బోధనా తరగతులు నిర్వహించాలన్నారు. అభ్యసన సామర్థ్యాలు పెంచడం, డ్రాపౌట్లను తగ్గించడం, జీఈఆర్‌ పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa