ఇతగాడు మామూలు చోరుడు కాదు.. ప్రియురాలి కోసం దొంగతనం బాట పట్టాడు. కాస్త కష్టపడితే బిందాస్‌గా ఎంజాయ్ చేయడానికి కావాల్సినంత డబ్బు దొరుకుతుండటంతో.. చోరీలనే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఇక గత పాతికేళ్ల నుంచి అతగాడి పని ఇదే. ఈమధ్యే దొంగతనాల్లో సెంచరీ పూర్తి చేశాడు. డబ్బులు దోచుకుని.. లగ్జరీ లైఫ్ గడుపుతుంటాడు.. హెలికాప్టర్లలో షికార్లు చేస్తుంటాడు. మరి ఇతగాడు పోలీసులకు చిక్కలేదా అంటే ఎందుకు చిక్కలేదు.. బోలేడన్ని సార్లు జైలుకు వెళ్లి వచ్చాడు. తాజాగా మే నెలలోనే జైలు నుంచి విడుదలయ్యాడు. కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని.. మళ్లీ తన చేతికి పని చెప్పాడు. బండ్లగూడలో రెండు ఇండ్లలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. చోరీల్లో సెంచరీ కొట్టిన అతడిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆవివరాలు..
దొంగతనాల్లో సెంచరీ దాటినా.. తీరు మార్చుకోకపోగా.. మళ్లీ మళ్లీ చోరీలకు పాల్పడుతున్న పేరు మోసిన దొంగ మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్ శెట్టి ని గురువారం నాడు..హైదరాబాద్ బండ్లగూడ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 35 గ్రాముల బంగారం ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా సునీల్ శెట్టి గురించి పోలీసులు ఆసక్తికర వివరాలు వెల్లడించారు.
పాతికేళ్లుగా దొంగతనాలు చేస్తూ..
మహ్మాద్ సలీమ్ అలియాస్ సునీల్ శెట్టి 1991లో దొంగతనాలు మొదలుపెట్టి.. ఇప్పటి వరకు చోరీల్లో సెంచరీ దాటేశాడు. 25 సార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇతడి మీద సీడీసీ షీట్ కూడా ఉంది. అయినా అతనిలో మార్పు రాలేదు. ఇక నెల రోజుల క్రితమే అనగా మే నెలలోనే జైలు నుంచి విడుదలైన.. మహ్మద్.. గురువారం బండ్లగూడ ప్రాంతంలో రెండు ఇండ్లలలో చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.
మహ్మద్ సలీమ్ అలియాస్ సునీల్ శెట్టి హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చోరీలు చేస్తాడు. అది కూడా తెల్లవారు జామును 4 గంటల ప్రాంతంలోనే దొంగతనాలకు బయలుదేరతాడు. పైగా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఇండ్లను మాత్రమే సెలక్ట్ చేసుకుని.. వారిళ్లలో దొంగతనాలు చేస్తుంటాడు. చోరీకి ముందు మొబైల్‌లో లూడో వంటి గేమ్‌లు ఆడుతుంటాడు. ఇక అతడు తెల్లవారుజామున 4 గంటలకే దొంగతనాలకు వెళ్లడానికి కారణం ఏంటంటే.. పాత బస్తీ ప్రాంతంలో చాలా వరకు తెలవారుజ జాము 3 గంటల వరకు అందరూ మెలుకువగా ఉంటారని.. 4 తర్వాత నిద్రపోతారని.. అందుకే అదే సమయాన్ని దొంగతనాలకు ఎంచుకుంటానని అతడు తెలిపాడు.
లవర్ కోసం తొలి దొంగతనం..
మహ్మద్ తన 16 ఏళ్లకే ప్రేమలో పడ్డాడు. లవర్‌తో కలిసి విలాసవంతంగా బతకడం కోసం మొట్ట మొదటి దొంగతనం చేశాడు. అలా తొలిసారి తన ఇంట్లో ఉన్న కిరాణా దుకాణంలో చోరీలు చేశాడు. అయితే దీని గురించి వారికి తెలియడంతో ఇంటి నుంచి పారిపోయాడు. అలా తన ప్రియురాలితో జల్సా చేసేందుకు చోరీల బాట పట్టిన మహ్మద్.. మొదటిసారిగా అతడి 18వ ఏట పోలీసులకు దొరికాడు. జైలులో అయిన పరిచయాలతో ఆ తర్వాత నుంచి ఇండ్లలో చోరీలకు అలవాటు పడ్డాడు..
చోరీ సొమ్ముతో హెలికాప్టర్లలో షికారు
మహ్మద్ సలీమ్ చోరీ చేసిన డబ్బుతో ముంబాయిలో అత్యంత విలాసవంతంగా ఖర్చు చేస్తాడు. గర్ల్‌ఫ్రెండ్స్‌కు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తాడు. హెలికాప్టర్లలో వెకేషన్‌కు వెళ్తూ లగ్జరీ లైఫ్ గడుపుతాడని పోలీసులు వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి అంటే పిచ్చి అభిమానం అని.. అందుకే తన పేరును సునీల్ శెట్టిగా మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. సునీల్ శెట్టిని కలవడానికి చాలా ప్రయత్నాలు చేశాడని.. కానీ అవకాశం రాలేదని తెలిపారు. ఎన్ని సార్లు జైలుకు వెళ్లి వచ్చినా అతడు తన తీరు మార్చుకోవడం లేదని పోలీసులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa