ఏడాది కాలంగా హామీల అమలులో కూటమి ప్రభుత్వం చేసిన మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని పార్టీ శ్రేణులకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వైయస్సార్సీపీ కార్యాలయంను ఆయన ప్రారంభించారు. అనంతరం'చంద్రబాబు ష్యూరిటీ - మోసం గ్యారెంటీ' క్యూఆర్ కోడ్‌తో కూడిన పోస్టర్‌ను పార్టీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో హామీల పేరుతో చేసిన మోసాలను ప్రజలందరికీ గుర్తుచేయడానికి వైయస్ జగన్ ఆదేశాలతో 'రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో' కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa