AP: పెద్దపులుల సంతానోత్పత్తి సమయం నేపథ్యంలో నాగార్జున సాగర్, శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం (NSTR)లో జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మానవ సంచారం నిషేధం అమలు కానుంది. పులుల సమాగానికి అడవిలో మనిషి కదలికలు అడ్డంకిగా ఉంటాయన్న కారణంతో మూడు నెలల పాటు నల్లమల అభయారణ్యంలో అన్ని రకాల మానవ కార్యకలాపాలకు విరామం ప్రకటించారు. దీంతో ఎకో-టూరిజం, పుణ్య క్షేత్రాల దారులు మూసివేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa