రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి తల, మొండెం వేరై ఆదివారం మృతి చెందాడు. చిత్తూరు(D) వెదురుకుప్పం (M) పెరుమాళ్లపల్లికి చెందిన రమేష్(44) బంధువుల అంత్యక్రియల నుంచి తిరిగి బైక్‌పై వస్తున్నాడు. మర్రిపల్లి వద్ద ఎదురుగా గ్రానైట్ లోడుతో వస్తున్న టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడి తల, మొండెం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa