వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నగరంలో తొలిసారిగా కృత్రిమ వర్షం (క్లౌడ్ సీడింగ్) కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే జులై 4 నుంచి 11వ తేదీ మధ్య ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వెల్లడించారు. ఈ ప్రణాళికను ఐఐటీ కాన్పూర్ రూపొందించగా, సాంకేతిక సమన్వయం కోసం IMDకి పంపినట్టు మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa