విశాఖపట్నంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లకు జాక్ పాట్ తగిలింది, మత్స్యకారుల వలలో అరుదైన లాబ్‌స్టర్‌లు పడ్డాయి. దీంతో జాలర్లు సంబరపడ్డారు. లాబ్‌స్టర్‌లు రొయ్యల మాదిరిగా కనిపించే సముద్రపు జీవులు. విదేశాల్లో వీటికి భారీగా డిమాండ్ ఉంది. జాలర్లకు చిక్కిన లాబ్‌స్టర్‌లలో రెండు పెద్దవి కూడా ఉన్నాయి. ఒక్కో లాబ్‌స్టర్ కిలో బరువు ఉన్నాయి. వీటిని ఒక్కొక్కదానిని రూ.2000 చొప్పున విక్రయించారు. లాబ్‌స్టర్లకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని.. అందుకే ఎక్కువ ధర పలుకుతాయని మత్స్యకారులు చెప్తున్నారు. మరోవైపు లాబ్‌స్టర్ అనేది చేప కాదు. ఇదో రకమైన సముద్ర జీవి. crustacean కుటుంబానికి చెందినది. లాబ్‌స్టర్ సాధారణంగా సముద్ర తీరాల్లో, రాళ్ల కిందస సముద్ర గర్భంలో నివసిస్తుంది. వీటి మాంసం చాలా రుచికరంగా ఉంటుంది. విదేశాల్లో వంటకాల్లో వీటిని ఉపయోగిస్తారు.
లాబ్‌స్టర్‌లకు గట్టి బాహ్య కవచం, రెండు పెద్ద పట్టెడలు, పొడవాటి ఆంటెన్నా, బలమైన తోక ఉంటాయి. లాబ్‌స్టర్ చూడటానికి అచ్చం రొయ్యలాగే కనిపిస్తుంది. సముద్ర గర్భంలో రాళ్లు, మూలల్లో నివసిస్తాయి. రాత్రి సమయంలో ఎక్కువగా చురుకుగా ఉంటాయి. లాబ్‌స్టర్‌లు సర్వభక్షక జీవులు. చిన్న చేపలు, మొలస్క్‌లు, సముద్ర మొక్కలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి.
లాబ్‌స్టర్‌లో ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు, విటమిన్ B12, మరియు జింక్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటి మాంసానికి విదేశాల్లో డిమాండ్ ఎక్కువ. లాబ్‌స్టర్ మాంసంలో అధికంగా ప్రొటీన్ ఉంటుంది, ఇది మానవ శరీరంలోని కండరాల అభివృద్ధికి తోడ్పడుతుంది. ఓమెగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడుతుంది.
లాబ్‌స్టర్‌లో విటమిన్ B12 అధికంగా ఉంటుంది, ఇది నర్వ్ ఫంక్షనింగ్‌కు, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. లాబ్‌స్టర్‌లో ఉండే జింక్, సెలీనియం, ఫాస్ఫరస్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో, థైరాయిడ్ ఫంక్షన్‌ను సరిచేయడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నారు. ఇతర చేపలతో పోల్చితే లాబ్‌స్టర్‌లలో తక్కువ కొవ్వుఉంటుందని చెప్తున్నారు. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో లాబ్‌స్టర్లకు డిమాండ్ అధికంగా ఉంటుందని వివరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa