అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజిమిన్ నేతన్యాహూలపై ఇరాన్ ముఖ్య మతపెద్ద ఫత్యా జారీచేశారు. వారిని "‘భగవంతునికి శత్రువులు’ గా ప్రకటిస్తూ షియా మతపెద్ద గ్రాండ్ ఆయతుల్లా నసెర్ మకారెం షిరాజీ మతపరమైన తీర్పు ఇచ్చారు. ‘ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని భయపెట్టే ఏ వ్యక్తి అయినా లేదా పాలక వ్యవస్థ అయినా ‘మోహారెబ్’ (దైవంతో యుద్ధం చేసే వ్యక్తి)గా పరిగణింపబడతారు’ అని ఫత్వాలో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ అమెరికా, ఇజ్రాయెల్ పాలకులను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్‌కు ఇటీవల ముస్లింలు ఫత్వా జారీచేసిన సంగతి తెలిసిందే.
మోహారెబ్ అంటే ఏమిటి?
మోహారెబ్ అనేది ఇస్లామిక్ న్యాయవ్యవస్థ ప్రకారం దైవంపై యుద్ధానికి దిగిన వ్యక్తి అని అర్థం.. ఇరాన్ మోహారెబ్‌గా గుర్తించివారిపై కఠిన శిక్షలు విధించవచ్చు: ఉరి, అవయవాల తొలగింపు, శిలువ వేయడం, దేశ బహిష్కరణ వంటివి ఇందులో ఉంటాయి. ‘ఈ నాయకులను సమర్థించేవారు లేదా సహకరించే ఇస్లామిక్ దేశాలు, ముస్లింలు హరామ్ (నిషిద్ధం) చేసిన పాపానికి పాల్పడినవారే’ అని పేర్కొన్నారు. ఈ నాయకుల పట్ల తమ తప్పులను గుర్తించేలా చేయాలని ముస్లింలను ఆయన కోరారు. ‘‘దైవ మార్గంలో పోరాడే ముస్లింలు కష్టాలు ఎదుర్కొన్నా, వారికి పరలోక ప్రాస్తి లభిస్తుంది’’ అని హామీ ఇచ్చారు.
జూన్ 13 ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్‌పై వైమానిక దాడులు ప్రారంభించింది. అణు శాస్త్రవేత్తలు, సైనిక అధికారులు హతమయ్యారు. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్ పట్టణాలపై విరుచుకుపడింది. ఈ క్రమంలో అమెరికా, ఇజ్రాయెల్‌తో కలిసి ఫోర్డో, నటాంఝ్, ఇస్ఫహాన్‌లో అణు కేంద్రాలపై దాడి చేసింది. దీనికి ప్రతిస్పందనంగా ఖతార్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు చేపట్టింది.
ఫత్వా అంటే ఏమిటి?
ఫత్వా అనేది షియా మతంలోని మార్జా (ఉన్నత మతపెద్ద)లు జారీ చేసే మత న్యాయ తీర్పు.. ఇది ముస్లిం ప్రభుత్వాలు, వ్యక్తులు పాటించాల్సిన మతాధికారపు ఆదేశంగా పరిగణిస్తారు. ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ప్రపంచ ముస్లింలపై ఉంటుంది. 1989లో రచయిత సల్మాన్ రష్దీపై కూడా అప్పటి ఇరాన్ గ్రాండ్ ఆయతుల్లా అయతుల్లా ఖమేనీ ఫత్వా జారీ చేశారు. ‘ది సాటానిక్ వర్సెస్’ పుస్తకాన్ని అవమానకరంగా భావించి, రష్దీని హత్య చేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో జపాన్ అనువాదకుడి హత్యకు గురికాగా.. పబ్లిషర్లపై దాడులు చేపట్టారు. 2023లో రష్దీపై కొరడాతో దాడి చేయడంతో ఆయన కంటిని కోల్పోయాడు
తాజా ఫత్వా ప్రపంచ రాజకీయాలు, మత సంబంధాలను మరింత ఉద్రిక్తతల్లోకి నెట్టేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఇప్పటికే కొనసాగుతున్న ఘర్షణలు ఈతీర్పుతో మరింత తీవ్రతరం కావచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa