భోపాల్‌లోని గాయత్రీనగర్‌లో నివసిస్తున్న సచిన్ రాజ్‌పుత్.. తనతో సహజీవనం చేస్తున్న భాగస్వామి రితిక సేన్‌ను మద్యం మత్తులో గొంతు నులిమి చంపేశాడు. ఉద్యోగం లేని సచిన్.. రితిక వేరొకరితో సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో చంపేసి, మృతదేహాన్ని దుప్పటితో చుట్టి ఇంట్లో దాచేశాడు. 2 రోజులు మృతదేహం పక్కనే నిద్రపోయాడు. మూడో రోజు మిత్రుడితో మద్యం సేవిస్తున్నప్పుడు హత్య గురించి చెప్పడంతో విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa