తాడిమర్రి మండలం పిన్నదరి పంచాయతీ పరిధిలోని పూలంపల్లిలో ఘోర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం గ్రామ శివారులో ఉన్న పొలాలలో గొర్రెలు గడ్డి తిన్న అనంతరం పక్కనే ఉన్న చెరువులోని నీటిని తాగాయి. అయితే ఆ నీరు కలుషితమై ఉండటంతో 20 గొర్రెలు ఒక్కొక్కటిగా కుప్పకూలి మృతిచెందాయి.
ఈ ఘటనపై బాధిత గొర్రెల కాపర్లు తీవ్రంగా స్పందించారు. “గొర్రెలు ఆరోగ్యంగా ఉండేవి. ఒక్కసారిగా నీరు తాగిన వెంటనే అవి కింద పడిపోవడం మొదలైంది,” అని వారు వాపోయారు. ఈ సంఘటన వల్ల తమకు దాదాపు రూ. 2 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని చెప్పారు.
ప్రభుత్వం నుంచి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరుతూ, అధికారులు దీనిపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. కాలుష్యం కారణాలు తేల్చి భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa