ఏపీలో రైతులకు ముఖ్యగమనిక. 2025 ఖరీఫ్ డిజిటల్ క్రాప్ సర్వే మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ-పంట డిజిటల్ సర్వేలో తప్పులు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు హెచ్చరించారు. సాగుకు అనుకూలంగా లేని భూములను తొలగించి, అనుకూలమైన వాటిని మాత్రమే ఎన్ఐసీ సర్వేకు అనుసంధానించామని చెప్పారు. ఈ-కేవైసీ తప్పనిసరి కాదన్నారు. సచివాలయ పునర్విభజనకు అనుగుణంగా మ్యాపింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa