తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి గ్రామ కమిటీలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం గూడూరు మండలం కప్పలదొడ్డి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. నిబద్ధతతో పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు లభిస్తాయని పేర్కొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa