AP: మరో 6 నెలల్లో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం బెంగళూరులో జీసీసీ గ్లోబల్ లీడర్లతో సమావేశమయ్యారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సరై సమయమన్నారు. మరో 6 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతుందన్నారు. ఇది భారత సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తోందని చెప్పారు. మరోవైపు విశాఖ మహానగరం ఐటీ హబ్‌గా తయారవుతోందని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa