ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్‌లో రైలు బాత్‌రూమ్‌లో పసికందు లభ్యమైన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టగా దారుణ విషయాలు వెలుగుచూశాయి. బీహార్‌కు చెందిన ఓ మైనర్ బాలికను ఆమె తండ్రే గర్భవతిని చేశాడని తెలిసింది. ఢిల్లీలో చికిత్స కోసం వెళ్తుండగా బాలిక రైల్లోనే ప్రసవించింది. అనంతరం పసికందును బ్యాగులో పెట్టి పరారయ్యారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa