మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి రాయ్‌పూర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టెక్నికల్ అలారం మోగడంతో తక్షణమే తిరిగి ల్యాండైంది. మంగళవారం ఉదయం 6:30కు బయలుదేరిన విమానం, 6:54కి సాంకేతిక లోపంతో వెనక్కి మళ్లింది. ఇండిగో యాజమాన్యం ఫ్లైట్‌ను రద్దు చేసి ప్రయాణికులకు డబ్బులు తిరిగి చెల్లించింది. ఇది ఫాల్స్ అలారంగా తేలినట్లు ఇంజినీర్స్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa