AP: విశాఖపట్నం మద్దిలపాలెంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. రాజరాజేశ్వరి ఆలయం వద్ద చెత్తబుట్టలో నవజాత మగ శిశువు మృతదేహం లభ్యమైంది. గురువారం ఉదయం ఈ దృశ్యం చూసిన స్థానికులు షాక్‌కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శిశువును కేజీహెచ్‌కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలిస్తూ దర్యాప్తు ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa