అనంతపురం జిల్లా తాడిపత్రిలో దారుణ హత్యాకాండ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక లావాదేవీలపై గొడవలు నడుస్తున్న నేపథ్యంలో నాగరాజు అనే వ్యక్తి, హర్షవర్ధన్‌ను వేట కొడవలితో దాడి చేసి నరికి చంపాడు. ఈ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
హర్షవర్ధన్, నాగరాజు మధ్య కొద్ది రోజులుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో నాగరాజు, హర్షవర్ధన్ ఇంటికి వెళ్లి చంపుతానని బెదిరించాడు. అనంతరం వేట కొడవలితో దాడి చేసి, హర్షవర్ధన్‌ను వెంటాడి నరికాడు. తీవ్రంగా గాయపడిన హర్షవర్ధన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. నాగరాజును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆర్థిక వివాదం నేపథ్యంలో జరిగిన ఈ హత్య స్థానికంగా ఉద్రిక్తతను రేకెత్తిస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa