మనిషి జీవిత కాలం నూరేళ్లు. కానీ మారుతున్న ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న రోగాల కారణంగా ఇది క్రమేణా తగ్గుతూ వస్తోంది. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా 60 ఏళ్లు బతికితే చాలనుకునే రోజులు వచ్చేశాయి. ఇలాంటి సమయంలో ఓ మనిషి వందేళ్లపైబడి జీవించడం అంటే మాములు విషయం కాదు. అందునా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా.. ఎవరి మీద ఆధారపడకుండా బతకడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. నేటి కాలంలో ఇలాంటి వారు చాలా చాలా అరుదు. ఆ జాబితాలోకి వస్తారు ప్రముఖ మారథాన్ ఫౌజా సింగ్ . 100 ఏళ్ల పైబడిన తర్వాత కూడా ఎంతో ఆరోగ్యంగా ఉండి.. ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఫౌజా సింగ్.. తాజాగా 114 ఏళ్ల వయసులో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం సంచనలంగా మారింది. ఆ వివరాలు..
పంజాబ్‌కు చెందిన ప్రముఖ మారథాన్ ఫౌజా సింగ్ 114 ఏళ్ల వయసులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. నడవటం కాదు.. మారథాన్ రన్నింగులు కూడా చేసేవారు. ఎంతో ఆరోగ్యంగా,చలాకీగా ఉన్న ఆయన మంగళవారం అనగా జులై 15న కన్ను మూశారు. సోమవారం మధ్యాహ్నం ఫౌజా సింగ్ రోడ్డు దాటుతూ ఉండగా గుర్తు తెలియని వాహనం ఆయన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్నిఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో మంగళవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే మంగళవారం తుది శ్వాస విడిచారు. ఫౌజా సింగ్ మరణంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
ఫౌజా సింగ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన సంతాపం తెలిపారు. ఈ మేరకు మోదీ తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. 114 ఏళ్ల వయసులో కూడా అద్భుతమైన ఫిట్ నెస్ కలిగి ఉండి.. ప్రత్యేక వ్యక్తిత్వం గల వెటరన్ మారథాన్ ఫౌజా సింగ్.. యువతకు ఆదర్శం. ఆయన అద్భుతమైన దృఢ సంకల్పం కలిగిన అసాధారణమైన అథ్లెట్ అంటూ పోస్ట్ చేశారు. ఫౌజాసింగ్ తన 100 ఏళ్ల వయసులో కూడా అంతర్జాతీయ మారథాన్‌లలో రికార్డులను బద్దలు కొట్టారు .
పూర్తి ఫిట్‌నెస్ ,ఆరోగ్యంతో జీవించిన ఫౌజా సింగ్ నేటి యువతకు ఆదర్శంగా నిలించారు. 114 యేళ్ల వయస్సులో కూడా ఫిట్‌నెస్ మెయిన్‌టేన్ చేస్తూ.. యువతకు సవాలు విసురుతూ.. ప్రపంచవ్యాప్తంగా టర్బన్డ్ టోర్నడోగా గుర్తింపు తెచ్చుకున్నారు. సిక్కు సూపర్‌మ్యాన్‌గా పిలువబడే ఫౌజా సింగ్.. తన 89 ఏళ్ల వయసులో.. 2000 సంవత్సరంలో లండన్ నిర్వహించిన మారథాన్‌లో పాల్గొన్నారు. దీంతో పాటు ఆయన టొరంటో, న్యూయార్క్,ఇతర నగరాల్లో నిర్వహించిన మారథాన్‌లో కూడా పాల్గొన్నారు. వివిధ మారాథాన్ ఫార్మాట్లలో రేసును పూర్తి చేసి అతిపెద్ద వయసు మారథానర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa