ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ భద్రత దృఢంగా మారిందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతమవడం ద్వారా భారత్ జోలికి రావద్దన్న సందేశం ప్రపంచ దేశాలకు వెళ్లిందని పేర్కొన్నారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో వరుస ఉగ్రదాడులు జరిగేవని, కానీ మోదీ పాలనలో అంతర్యుద్ధ శక్తులకు సమాధానం చెప్పగల సామర్థ్యం భారత్ సాధించిందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa