AP: అసెంబ్లీ కమిటీ హాలులో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అధ్యక్షతన పిటిషన్ల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్, సైబర్ నేరాల నియంత్రణపై చర్చించారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి టోల్‌ఫ్రీ నంబర్ 1930ను అందుబాటులో ఉంచినట్లు రఘురామ తెలిపారు. ఈ నంబర్‌కు కాల్ చేయగానే నేరం నమోదు అవుతుందని, ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించి కూడా ఇదే నంబర్‌కు చేయవచ్చని చెప్పారు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa