అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తున్న నేపథ్యంలో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో శుక్రవారం ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ మంత్రి శైలజనాథ్‌తో పాటు ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చేందుకు స్వగ్రామమైన యల్లనూరు మండలం తిమ్మంపల్లి నుంచి ఆయన తాడిపత్రికి బయల్దేరడానికి సిద్ధమవగా.. పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రి రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు సిబ్బందితో తిమ్మంపల్లి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, పెద్దారెడ్డి అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆయనకు నోటీసులు ఇచ్చి ఇంట్లోకి పంపించారు. బయటకురాకుండా గృహనిర్బంధం చేశారు. పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa