ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రావణలక్ష్మికి’ స్వాగత సత్కారమే ‘శ్రావణమాసము’

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jul 20, 2025, 09:05 AM

చైత్రాది పరిగణంలో ఆషాఢం తర్వాత వచ్చే ఐదవ మాసం ‘శ్రావణం’. ఈ నెలలో ఏ ఒక్కరోజో కాక నెలంతా ప్రతినాడూ పండుగే మరి. వ్రతాలు , పూజలు , నోములు ఈ నెలలో అధికం. ప్రతి శుక్రవారం ప్రతి ఇల్లాలు తానే మహాలక్ష్మి అయిపోతుంది. అంతేకాదు, ఆషాఢం అడ్డు తొగిపోయి కొత్త అల్లుళ్ళ రాకతో మరో పండుగగా భాస్లిుతుంది.


జులై 25 ప్రారంభమైన శ్రావణమాసం ఆగష్టు 23 వరకు ఉండనుంది.ఈ సంవత్సరం శ్రావణ మాసంలో  జులై 29 5,12,19 తేదీలలో మంగళవారాలు వచ్చాయి. ఇవి శ్రావణ మంగళవారాలన్నమాటజులై 25, ఆగష్టు 1,8,15,22, తేదీల్లో శుక్రవారలు వచ్చాయి. ఇది శ్రావణ శుక్రవారాన్నమాట.విష్ణుమూర్తిది శ్రవణా నక్షత్రం. ఆయనకి ప్రియమైన మాసము. అలాంటి శ్రవణా నక్షత్రంతో కూడిన పూర్ణిమనే ‘శ్రావణ పూర్ణిమ’ అంటారు. అందుకే ఈ మాసానికి ఆ పేరు వచ్చింది. 


శ్రీకృష్ణుడు పుట్టిన మాసం కూడా ఇదే (కృష్ణాష్టమి).


 


గరుడుడు అమృతభాండాన్ని సాధించింది ఈ మాసంలో ‘శుద్ధ పంచమి’ నాడు.


 


హయగ్రీవోత్పత్తి జరిగింది ఈ మాసంలోనే.


 


అరవిందయోగి పుట్టిందీ ఈ మాసంలోనే.


 


బదరీనారాయణ, పెరుమాళ్‌, అళవందారు తదితరు తిరు నక్షత్రాలు ఈ మాసంలోనే.


 


శ్రావణ మాసంలో పుట్టినవారి గురించి యవన జాతకం ఏమంటుందంటే ‘సమర్థు, వేదోక్త కర్ము చేసేవారు` పుత్రులతో, కళత్రముతో, ధనంతో, ధాన్యంతో, ఆభరణాలతో ఎల్ల జనంచేత పూజింపబడుతారట.


 


మత్స్య పురాణాన్ని అనుసరించి శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ఆరంభిస్తే భృత్యలాభం కలు గుతుంది.


 


శ్రావణ మాసంలో వారాలు, తిథులు రెండూ ప్రత్యేకమైనవే. వాటిని తెలుసుకొని దానికి తగినట్లు తమకి తోచినట్లుగా భక్తిశ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందాలి.


 


శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని ఆరాధిస్తే, శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారంనాడు చేసే ‘వరలక్ష్మి’ వ్రతం అత్యంత పుణ్యప్రదమైనదిగా మహిళలు భావిస్తారు. శ్రావణ మంగళ, శుక్రవారాలను పక్కకుపెడితే ఈ మాసంలో అనేకానేక విశిష్టతు ఉన్నాయి.


 


సోమవారంతో ఆరంభిస్తే శ్రావణ సోమవారాల్లో ‘శివుడి’కి అభిషేకాలు చేస్తారు. మారేడు దళాలతో పూజిస్తారు. కేవలం కూరగాయులు , పళ్ళు తిని ఉపవాసం చేస్తారు. మంగళవారాలు కొత్తగా వివాహమైన స్త్రీలు శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం ‘మంగళ గౌరీ’ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇలా ఆచరిస్తే జన్మజన్మల్లో అమంగళం కలగకుండా ఉంటుందని విశ్వాసం భారతీయ స్త్రీలో గాఢంగా ఉంది. బుధవారంనాడు ‘విగ్నేశ్వరుడి’ ని పూజిస్తారు. గురువారంనాడు ‘గురువుని దేవుళ్ళ’ ని పూజిస్తారు. ఇక శుక్రవారానికి ఉన్న ప్రత్యేకత చెప్పనలవి కాదు.లక్ష్మికి, తులసికి పూజలు చేసేవారున్నారు. ఈ శ్రావణ శుక్రవార వ్రతంవల్ల పాపాలు పోవడమేకాక లక్ష్మీప్రసన్నులు కాగలరు. అందులో శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారం చాలా మహత్తు గలది. ఈ లక్ష్మి వ్రతం ధన, కనక, వస్తు, వాహనాది వృద్ధికి మూలం. ఇక శనివారాలు హనుమంతుని, వేంకటేశ్వరుని, శనీశ్వరుడిని పూజిస్తారు. అసలు వారానికి ఉన్న ఏడు రోజులో మాఘమాసం ‘ఆదివారానికి’, కార్తికమాసం ‘సోమవారానికి’, మార్గశిర మాసం ‘గురువారానికి’ మహత్తు కలవైతే ఇక శ్రావణ మాసంలో మిగిలిన నాలుగు వారాలు మంగళ, శుక్ర, శనివారాలు చాలా మహత్తు గలవిగా భక్తులు భావిస్తారు. శ్రావణమాసంలో శనివారంనాడు ‘పెద్ద తిరుపతి’ లో పూజా విశేషాలు అధికంగా జరు పుతారు. అసలు ద్విజులు జంధ్యాలు ధరించే ఆచారంగల మాసం ఇదే. రక్షాబంధం (రాఖీ పౌర్ణమి) ద్వారా అక్కాతమ్ముళ్ళు, అన్నాచెల్లెళ్ళ మధ్య ప్రేమను దృఢతరం చేసే మంచి మాసం ‘శ్రావణం’. ప్రకృతి కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షాధారాల చే తామరపువ్వు, గిరి మల్లిల కు, ఇంద్ర ధనుస్సు, నెమళ్ళు, కప్పలు ... ఉరుము, మెరుపుతో చాలా చాలా హాయిగా వుంటుంది.


 


శ్రావణ మాసంలో వారాలే కాదు, ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంటుంది. ‘శ్రావణ శుద్ధ పంచమి’ నాగపూజకు ఉన్నతమైనది. ఈరోజు గోధుమ పాయసంచేసి నాగదేవతకు నివేదిస్తారు. ‘శ్రావణ శుద్ధ షష్టి’ రోజున సూపాదన వ్రతం చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది. అంటే పప్పు, అన్నం. ఆ రోజు శివుడిని పూజించి పప్పు, అన్నం నైవేద్యంగా భక్తు పెడతారు. దీనివల్ల ఆ కుటుంబానికి ఆయురారోగ్యాలు కలుగుతాయని విశేష నమ్మకం! ‘శ్రావణ శుద్ధ సప్తమి’నాడు సూర్యభగవానుని తప్పక పూజించాలిట. ఆనాడు చేసే జప, దాన, హోమాు శుభఫలితాన్నిస్తాయని అంటారు. ‘శ్రావణ శుద్ధ అష్టమి’నాడు దుర్గావ్రతాన్ని ఆచరించడం చాలా మంచిది. శ్రావణ శుద్ధ దశమి’నే అంశా దశమి అంటారు. ఈ రోజు శివుణ్ణి పూజిస్తారు సంతానాన్ని ఆశించే స్త్రీలు . ‘శ్రావణ శుద్ధ ఏకాదశి’, దీన్నే పుత్ర ఏకాదశి అని అంటారు. ఈ రోజున నిష్టగా ఏకాదశి వ్రతం చేస్తారు. దీని అర్థం, ఉద్దేశం పేరులోనే ఉంది. సంతానాన్ని ఆశించే దంపతులు చేస్తారు. పుత్రునికై శ్రావణ శుద్ధ ద్వాదశినాడు అనంగుడికి పూజు చేస్తారు. దీన్నే అనంగ త్రయోదశి అని అంటారు. ఈనాడు ఎర్రరంగు పూలు, అక్షతతో రతీమన్నథును పూజిస్తారు అనేకమంది. ‘శ్రావణ శుద్ధ చతుర్దశి’ నాడు ‘శివుడి’ని పూజిస్తారు. ‘శ్రావణ శుద్ధ పౌర్ణమి’ నాడు రాఖి. ఈ నెల లో వచ్చే ఒక్కో తిథికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇక శ్రావణ తదియ, చవితి, బహుళాష్టమి చాలా పవిత్రమైనవిగా చెబుతూ ఉంటారు.


 


శ్రావణ మాసంలో ఉపవాస దీక్ష...


 


పండుగరోజుల్లో దైవానుగ్రహం కోసం సాధన, ధ్యానం అవసరం. సాధనకోసం శరీరం, మనస్సు రెండూ సిద్ధంగా వుండాలి. ఎంతో నియమ నిష్టలు పాటించే వ్యక్తి ఆహారం విషయంలో కొంత నియంత్రణ పాటించవచ్చునేమో కానీ, అనేక ఇతర కారణాల వల్ల నివారణ సాధ్యపడదు. ఆరోగ్యానికి ఇబ్బంది కూడా ఇలాంటి సందర్భాలో ఏర్పడవచ్చు.


 


ఉపవాసం అంటే కడుపు మాడ్చుకొని ఉండాల్సిన పనిలేదు. అయితే, సాత్త్వికమైన ఆహారం తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి, మాంసం, గుడ్డు వంటివి పనికిరావు. అన్నిరకాల పండ్లు, పాల తోచేసిన తీపి పదార్థాలు, పప్పు, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు, గోధుమ, జొన్న పిండ్లతో చేసిన పదార్థాలు తీసుకోవాలి. దుంపలు తీసుకోవచ్చు. పండ్లరసాలు కూడా మంచివే. ఏవి తీసుకున్నా స్వచ్ఛమైనవి, వేడిమీద తీసుకోవడమే మంచిదని గుర్తించాలి. సువాసన ద్రవ్యాల తో ధూపంవేసిన వస్త్రాలు ధరించటం చాలా మంచిదని చెప్పాలి ఆరోగ్యానికి. 


 


మంగళగౌరీవ్రతం విధానం:


 


శ్రావణ మంగళవారాల్లో మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. అంటే శ్రావణ మంగళవారంనాడు గౌరీవ్రతం ఆచరిస్తే సౌభాగ్యం కలుగుతుంది. మాంగల్య బలమే కాదు వివాహయోగాన్ని కూడా గౌరీదేవి తనను అర్చించినవారికి ప్రసాదిస్తుంది. స్త్రీలు విహానంతరం ప్రథమ శ్రావణమాసం పుట్టింట, ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు అత్తింట వ్రతాన్ని ఆచరించాలి.


 


అన్ని శుభాలనిచ్చేది... శివుని భార్య. అన్ని కోరిక కు తీర్చేది, ముగ్గురమ్మ మూపుటమ్మ, శ్రీ మహావిష్ణువు సోదరి అయిన గౌరీదేవికి నమస్కారం.


 


మొదట శౌనకాది మహర్షుకు సూతువారు వివరించారు. నారదుడు ఈ మాహాత్మ్యాన్ని ‘సావిత్రి’కి ఉపదేశించాడు. ఆ మంగళగౌరీ మహాత్మ్యాన్ని శ్రీకృష్ణుడు ద్రౌపదికి ఉపదేశించాడు. పరాశక్తే మంగళగౌరిగా లోకంలో ప్రఖ్యాతి గాంచినది. ఆమంగళగౌరి కృపాకటాక్షాలు ఏ స్త్రీపై ఉంటాయో వారికి వైధవ్యం ఉండదు. సర్వవిధములైన సౌభాగ్యాతో అలరారుతారు. ఆ మహాదేవిని శ్రద్ధాభక్తుతో అర్చించాలి.


 


అసలు మంగళగౌరి ఉండే ప్రదేశాలు తెలుసా?


 


పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళద్రవ్యాలు, ఆవునేతితో ప్రకాశించే జ్యోతిలో కొలువై ఉంటుంది. ఆమెను కొలిచి సౌభాగ్యవంతులైన, పావనులైన స్త్రీలు ఎందరో ఉన్నారు.  


 


త్రిపురాసురుణ్ణి సంహరించే ముందు ఈశ్వరుడు ‘గౌరీదేవి’ని పూజించాడు. అందువల్లే విజయాన్ని పొందాడు.


 


మంగళగౌరిని పూజింటంవల్లే కుజుడు మంగళవారానికి అధిపతి కాగలిగాడు. మనువంశానికి చెందిన ‘మందు’ డనే మహారాజు గౌరీదేవి వ్రత ప్రభావంతో చాలాకాలం భూలోకంలో సర్వసంపదతో రాజ్యమేలాడు.


 


ఓ ద్రౌపదీ! గౌరీదేవిని పూజించి వైధవ్యాన్ని తొగించుకొన్న ఒక అదృష్టవంతురాలైన యువతి కథ చెబుతాను విను అంటూ శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు.


వ్రత కథ: పూర్వం మాహిష్మతీ నగరాన్ని పాలించే జయపాలుడనే రాజుకు సంతానం లేదు. ఈయన ఈశ్వర భక్తుడు. ఒకరోజు పరమశివుడు సన్న్యాసి వేషంలో వచ్చి ఆ రాజు భార్యకు సంతానం కలిగే మార్గాన్ని తెలియజేస్తాడు. ‘నీ భర్తను నీలివస్త్రాలు ధరించి అశ్వంమీద బయుదేరమను. ఆ అశ్వం ఎక్కడైతే అలసి పడిపోతుందో అక్కడ తవ్వి చూడమను. అక్కడ ఒక బంగారు దేవాయం కనపడుతుంది. అందులో ఉన్న భగవతీదేవిని పూజిస్తే ఆమె తప్పక అనుగ్రహిస్తుంది. మీ దంపతులకు సంతానం కలుగుతుంది అని సన్న్యాసిరూపంలో ఉన్న ఈశ్వరుడు చెప్పి వెళ్ళిపోతాడు.


 


రాణి ఈ విషయాన్ని రాజుకు విశదీకరించింది. ఆయన అదేవిధంగా చేస్తాడు. భఘవతీదేవి ప్రత్యక్షమై వైధవ్యంగల కుమార్తె కావాలా? అల్పాయుష్కుడు, సజ్జనుడైన కుమారుడు కావాలా? కోరుకోమని అంటుంది. తనకు కొడుకే కావాంటాడు ఆ మహారాజు. ఆవిధంగా అనుగ్రహించిన దేవి, ‘‘నా పార్శ్వదిక్కున ఉన్న గణపతి విగ్రహంవద్ద చూత వృక్షానికున్న ఫలాన్ని నీ భార్యకిమ్మ’ని చెబుతుంది. రాజు ఒక్క ఫలాన్ని కోయగానే మిగిలిన ఫలాలు మాయమవుతాయి. అందుకు కోపించిన విఘ్నేశ్వరుడు నీ కొడుకు పదహారవ ఏట పాముకాటుకు గురై మరణిస్తాడని శపిస్తాడు.ఫలితంగా రాణికి మగబిడ్డ పుడతాడు. అతడికి శివుడనే పేరు పెడతారు. పదహారేళ్ళ వయస్సు వస్తోంది కనుక మన బిడ్డకు వివాహం చేద్దామని ఆ ప్లివాడిని మేనమామతో కాశీ పంపిస్తాడు. శివుడు మేనమామతో కలిసి కాశీవెడుతూ మార్గమధ్యంలో ప్రతిష్ఠానపురం చేరతాడు. అక్కడ దేవాయంవద్ద విశ్రమిస్తాడు. ఇంతలో సుశీల అనే అమ్మాయి తన స్నేహితురాళ్ళతో ఆడుకుంటుంటే ఒకమ్మాయి కోపంతో సుశీల ను ‘రండా’ అని తిడుతుంది. మా ఇంట్లో రండఎవరూ ఉండరు. కారణం మా అమ్మ మంగళగౌరీ వ్రతం చేస్తుందని చెబుతుంది. ఆ మాటు మేనమామ వింటాడు. సుశీల తండ్రి పరమేశ్వరాయానికి వెళ్ళినప్పుడు విగ్రహం వెనుక నిల బడి ‘నీ కుమార్తెను శివుడికి ఇచ్చి వివాహం చేయి’ అని చెబుతాడు శివుని మేనమామ. దైవం ఆ మాటు అన్నట్లుగా భ్రమపడి సుశీల తండ్రి తన కుమార్తెను శివుడికి ఇచ్చి వివాహం చేస్తాడు. సుశీల కు ఆ రాత్రి మంగళగౌరి కలో కనపడి ‘నీ భర్తను కాటువేయడానికి ఒక సర్పం వస్తుంది నీవు ఒక పాల కుండ పెట్టు. ఆ పాము పాలు తాగడానికి కుండలోకి ప్రవేశిస్తుంది. వెంటనే ఒక వస్త్రాన్ని కప్పి కట్టివేసి, రేవు నీ తల్లికి ఆ కుండను వాయనంగా ఇవ్వాలని చెబుతుంది.


 


గౌరీదేవి కలలో చెప్పిన విధంగానే జరుగుతుంది. ఆ తల్లి చెప్పినవిధంగానే ఆచరిస్తుంది సుశీల. ఆ తర్వాత ఆమె తల్లి కుండమీద గుడ్డను తొగిస్తే అక్కడ పాము ఉండదు. ఓ ముత్యాల దండ కనపడుతుంది. ఆవిధంగా పాము కాటునుంచి తన భర్తను కాపాడుతుంది సుశీల . ఆ తరవాత సుశీ ల భర్తతో కలిసి గౌరీ వ్రతాన్ని ఆచరించి అత్తవారింటికి వెళుతుంది. గౌరీదేవి వ్రతాన్ని ఆచరించడంవన అతి భయంకరమైన వైదవ్యాన్ని తప్పించుకున్న సుశీల కథ ఇది. శ్రద్ధాసక్తుల తో గౌరీదేవిని పూజించి ఈ వ్రతకథను చదువుకున్న స్త్రీల కు వైధవ్యం కలగదు. సకల సౌభాగ్యాలు కలుగుతాయని శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పాడు.


 


మంగళవారాల్లో గౌరీదేవికి పూజలు నిర్వహిస్తూ, పసుపు ముద్ద తయారుచేసి కుంకుమ అద్ది, పూలు , అక్షతల తో పూజలు నిర్వహించి కొత్తగా పెళ్ళయినవారు మంగళగౌరీ వ్రతం చేసుకొని పెద్దల ఆశీస్సు అందుకుంటారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాల ని కోరుతూ గౌరీదేవి పూజచేస్తే, వివాహితులు తమ వైవాహికబంధం సజావుగా, సక్రమంగా సాగాల ని కోరుతూ చేస్తారు. ఏది ఏమైనా ఈ ‘‘మంగళగౌరీ వ్రతం’’ ఈ శ్రావణ మాసం ఆరంభంలో వచ్చి స్త్రీలకు వరాల్ని ఇస్తుంది.


 


డా|| ఈడ్పుగంటి పద్మజారాణి / Dr Edupuganti Padmaja Rani


జ్యోతిష్యము & వాస్తు నిపుణురాలు / Astrology & Vaastu Consultant


email : padma.suryapaper@gmail.com


www.padmamukhi.com






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa